అవినాష్‌రెడ్డికి హైకోర్టు అనుమతి

జమ్మలమడుగు నియోజక వర్గంలో వైసీపీ నేతల బృందం పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి నేతృత్వంలోని బృందాన్ని జమ్మలమడుగు నియోజకవర్గంలోని గోరిగెనురు గ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామంలోని టీడీపీ వర్గీయులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్‌, కడప మేయర్ తదితరులు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు వెళ్లే సమయంలోనే మంత్రి […]

Advertisement
Update:2018-11-23 02:25 IST

జమ్మలమడుగు నియోజక వర్గంలో వైసీపీ నేతల బృందం పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి నేతృత్వంలోని బృందాన్ని జమ్మలమడుగు నియోజకవర్గంలోని గోరిగెనురు గ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

గ్రామంలోని టీడీపీ వర్గీయులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్‌, కడప మేయర్ తదితరులు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

వైసీపీ నేతలు వెళ్లే సమయంలోనే మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి, టీడీపీ నేతలు గోరిగెనురు గ్రామానికి వెళ్లి పార్టీ మారే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో ఇరువర్గాలు గ్రామంలోకి వెళ్తే ఉద్రిక్తత నెలకొంటుందని పోలీసులు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

తనను నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడాన్ని వైసీపీ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు వైసీపీ నేతలను గ్రామాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. అదే సమయంలో గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని వైసీపీ నేతలకు సూచించింది.

Tags:    
Advertisement

Similar News