ఆఖరి నిమిషంలో వాళ్లు తెరాసకు చుక్కలు చూపిస్తున్నారు!

ఎంత జేసినా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రెబల్స్ టెన్షన్ అయితే తగ్గడం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్తూనే కేసీఆర్ ముందుగా అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశాడు. ఉన్న సీట్లలో కొన్నింటిని మినహాయించి మెజారిటీ సీట్లకు అప్పుడే అభ్యర్థులను ప్రకటించేశాడు. ప్రత్యర్థి పార్టీలు ఇంకా ఎన్నికలు వస్తాయో రావో తెలియని స్థితిలో ఉండగానే కేసీఆర్ ఏకంగా అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశాడు. ఆ విధంగా తెలంగాణ ఎన్నికల పోరాటంలో లీడ్ లో కనిపించాడు. ఇదంతా జరిగి నెల […]

Advertisement
Update:2018-11-21 01:00 IST

ఎంత జేసినా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రెబల్స్ టెన్షన్ అయితే తగ్గడం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్తూనే కేసీఆర్ ముందుగా అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశాడు. ఉన్న సీట్లలో కొన్నింటిని మినహాయించి మెజారిటీ సీట్లకు అప్పుడే అభ్యర్థులను ప్రకటించేశాడు.

ప్రత్యర్థి పార్టీలు ఇంకా ఎన్నికలు వస్తాయో రావో తెలియని స్థితిలో ఉండగానే కేసీఆర్ ఏకంగా అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశాడు. ఆ విధంగా తెలంగాణ ఎన్నికల పోరాటంలో లీడ్ లో కనిపించాడు.

ఇదంతా జరిగి నెల గడిచిపోయింది. కానీ.. ఇప్పటి వరకూ తెరాసలో రెబల్స్‌ హోరు మాత్రం తగ్గకపోవడం విశేషం. తమకు టికెట్లు దక్కలేదని పలువురు తెరాస నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. వారు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. వెళ్లిపోయే వారు వెళ్లిపోయారు. వాళ్లతో కేసీఆర్ కు బాధలేదు కానీ.. కొందరు రెబల్స్ గా రంగంలోకి దిగడం ఇబ్బందికరంగా మారింది.

తమకు టికెట్ లభించలేదనే బాధతో వీరు రెబల్స్ గా రంగంలోకి దిగారని స్పష్టం అవుతోంది. వీరిలో కొందరు గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసిన వాళ్లున్నారు. అప్పట్లో వీళ్లు తృటిలో విజయాన్ని కోల్పోయారు. ఇప్పుడు రెబల్స్ గా రంగంలోకి దిగి తెరాన అధినేతను టెన్షన్ పెడుతున్నారు.

తెరాస రెబల్స్ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను పరిశీలిస్తే… రామగుండం, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, కోదాడ, స్టేషన్ ఘన్ పూర్, మక్తల్,మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి.

వీటిల్లో తెరాస తరఫున టికెట్ లభించలేదు అనే అసహనంతో పలువురు నేతలు ఇండిపెండెంట్స్ గా రంగంలోకి దిగారు. వీళ్లు తెరాస ఓట్లను భారీ ఎత్తున చీల్చుతారనే అంచనాలున్నాయి. అలా జరిగితే తెరాసకు తీవ్ర నష్టమే.

Tags:    
Advertisement

Similar News