కేసు క్లోజ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ పోలీసులు చేతులెత్తేశారు. రాజధానిలో పంటపొలాల దహనం కేసులో చేతులెత్తేశారు. నిందితులను పట్టుకోలేకపోయామంటూ కేసును క్లోజ్ చేశారు. రాజధానికి భూములు ఇవ్వకుండా పంటలు సాగుచేసుకుంటున్న రైతుల పొలాలపై 2014 డిసెంబర్‌ 29న కొందరు విరుచుకుపడ్డారు. తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో 13 చోట్ల పంటలను తగలబెట్టారు. ఆ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజధానికి భూములు ఇవ్వని రైతులను బెదరగొట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేయించిందని రైతులు ఆరోపించారు. కానీ చంద్రబాబు మాత్రం ఘటన జరిగిన వెంటనే మీడియా […]

Advertisement
Update:2018-11-19 08:30 IST

ఏపీ పోలీసులు చేతులెత్తేశారు. రాజధానిలో పంటపొలాల దహనం కేసులో చేతులెత్తేశారు. నిందితులను పట్టుకోలేకపోయామంటూ కేసును క్లోజ్ చేశారు. రాజధానికి భూములు ఇవ్వకుండా పంటలు సాగుచేసుకుంటున్న రైతుల పొలాలపై 2014 డిసెంబర్‌ 29న కొందరు విరుచుకుపడ్డారు.

తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో 13 చోట్ల పంటలను తగలబెట్టారు. ఆ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజధానికి భూములు ఇవ్వని రైతులను బెదరగొట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేయించిందని రైతులు ఆరోపించారు. కానీ చంద్రబాబు మాత్రం ఘటన జరిగిన వెంటనే మీడియా ముందుకొచ్చి వైసీపీనే ఈ పని చేయించిందని ఆరోపించారు.

ఆ విషయం నిరూపించలేకపోయారు. పైగా పంటపొలాల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాటి గుంటూరు జిల్లా, రూరల్ ఎస్పీలు లోతుగా దర్యాప్తు చేశారు. అసలు నిందితులను గుర్తించే స్థితికి విచారణ చేరుకున్న సమయంలో నిందితులు ఎవరో చూచాయగా తెలిశాక, ఆ విషయం బయటకు రావడం ఇష్టంలేని ప్రభుత్వం హఠాత్తుగా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసింది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా కేసును క్లోజ్ చేశారు. కేసును క్లోజ్ చేసిన పోలీసులు… బాధిత రైతులకు నోటీసులు ఇచ్చారు. పంటలు తగలబెట్టిన వారిని గుర్తించలేకపోయామని చెప్పిన పోలీసులు… రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు.

రైతులు కోర్టుకు వెళ్లకుండా నోటీసులను పాత తేదీలతో తయారు చేసి తాజాగా రైతులతో సంతకాలు పెట్టించుకున్నారు. పోలీసుల తీరుపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News