హాయ్‌లాండ్ మాది కాదు.... హైకోర్టులో సంచలన పరిణామం
లక్షల మంది జీవితాలతో ముడిపడిన అగ్రిగోల్డ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వేల కోట్ల విలువైన హాయ్‌లాండ్‌ను కొట్టేసేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో శుక్రవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోందని భావిస్తున్న తరుణంలో… అసలు హాయ్‌లాండ్‌కు అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటూ ఆలూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టుకు వచ్చారు. హాయ్ లాండ్ తనది అంటూ కోర్టుకు వచ్చాడు. దీంతో హైకోర్టు విస్మయానికి […]
లక్షల మంది జీవితాలతో ముడిపడిన అగ్రిగోల్డ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వేల కోట్ల విలువైన హాయ్‌లాండ్‌ను కొట్టేసేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో శుక్రవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది.
అగ్రిగోల్డ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోందని భావిస్తున్న తరుణంలో… అసలు హాయ్‌లాండ్‌కు అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటూ ఆలూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టుకు వచ్చారు. హాయ్ లాండ్ తనది అంటూ కోర్టుకు వచ్చాడు. దీంతో హైకోర్టు విస్మయానికి గురైంది.
మూడేళ్లుగా హాయ్‌లాండ్ భూమి అగ్రిగోల్డ్‌దేనని కేసు విచారిస్తుంటే ఇప్పుడు హఠాత్తుగా ఆలూరు వెంకటేశ్వరరావు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టులో ఉన్న అగ్రిగోల్డ్ యాజమాన్యపు తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఆ న్యాయవాది కూడా హాయ్‌లాండ్‌కు, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హాయ్‌లాండ్ వేల కోట్లు చేస్తుందని.. అది అగ్రిగోల్డ్ ఆస్తే అంటూ గతంలో అఫిడవిట్ ఇచ్చి ఇప్పుడు మాత్రం అగ్రిగోల్డ్‌కు, హాయ్‌లాండ్‌కు సంబంధం లేదని ఎలా చెబుతున్నారని ఫైర్ అయింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం పరిధిలోని సీఐడీ విచారణ తీరుపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే హాయ్‌లాండ్‌పై సిట్ చేత విచారణ జరిపించాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
హఠాత్తుగా హాయ్‌లాండ్ తమది కాదని అగ్రిగోల్డ్ సంస్థ న్యాయవాది చెప్పడంపై అగ్రిగోల్డ్ బాధితుల తరపు పిటిషనర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు కొలిక్కి వస్తోందనుకున్న ప్రతిసారి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. హాయ్‌లాండ్ భూములతో సంబంధం లేకుంటే హాయ్‌లాండ్ భూములు వేల కోట్ల విలువ చేస్తాయంటూ గతంలో అగ్రిగోల్డ్ సంస్థ ఎందుకు చెప్పిందని ప్రశ్నించారు.
లక్షలాది మంది డిపాజిటర్ల నోట్లో మట్టి కొట్టి వేల కోట్ల విలువైన హాయ్‌లాండ్ భూములను కాజేసేందుకు పెద్దలు కుట్ర పన్నారని.. అందులో భాగంగానే హాయ్‌లాండ్‌కు తమకు సంబంధం లేదని అగ్రిగోల్డ్ సంస్థ న్యాయవాది చేత చెప్పించి… తెరపైకి ఆలూరు వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొచ్చారని బాధితులు కోర్టు వద్ద వాపోయారు.