ఈ మాట చిరంజీవితో చెప్పించగలవా పవన్‌?

తాను అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించానని తనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కన్నబాబు తీవ్రంగా స్పందించారు. తాను అవినీతి చేసి కోట్లే సంపాదించి ఉంటే మొన్నటి ఎన్నికల్లోనే గెలిచేవాడినన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా 44 వేల ఓట్లు సాధించానని గుర్తు చేశారు. అవినీతికి తాను పాల్పడినట్టు నిరూపిస్తే ఆ ఆస్తులన్నీ పవన్‌ కల్యాణ్‌కే రాసిస్తానని సవాల్ చేశారు. కానిస్టేబుల్‌‌ కుమారుడిని అని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌ […]

Advertisement
Update: 2018-11-15 00:28 GMT

తాను అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించానని తనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కన్నబాబు తీవ్రంగా స్పందించారు. తాను అవినీతి చేసి కోట్లే సంపాదించి ఉంటే మొన్నటి ఎన్నికల్లోనే గెలిచేవాడినన్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా 44 వేల ఓట్లు సాధించానని గుర్తు చేశారు. అవినీతికి తాను పాల్పడినట్టు నిరూపిస్తే ఆ ఆస్తులన్నీ పవన్‌ కల్యాణ్‌కే రాసిస్తానని సవాల్ చేశారు. కానిస్టేబుల్‌‌ కుమారుడిని అని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలనుకోవచ్చు… స్కూటర్‌పై తిరిగే తాను ఎమ్మెల్యే కాకూడదా అని ప్రశ్నించారు.

స్కూటర్‌పై తిరిగే తాను ఎమ్మెల్యే అయితే పవన్‌ కల్యాణ్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కన్నబాబు లాంటి వారి వల్లే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేశారంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. తనలాంటి వారి వల్లే ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిందంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

ఇదే విషయాన్ని చిరంజీవి చేత పవన్‌ కల్యాణ్ చెప్పించగలరా అని కన్నబాబు సవాల్ చేశారు. తాను ఏమైనా మాట్లాడొచ్చు…. ఎదుటివారు మాత్రం తిరిగి తనను ఏమీ అనకూడదన్న భావన పవన్‌ కల్యాణ్‌లో ఉందన్నారు.

అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షంపై పవన్‌ కల్యాణ్ విమర్శలు చేయడం బట్టి చూస్తుంటే ఆయన టీడీపీ కనుసన్నల్లోనే ఇంకా పనిచేస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పవన్‌ కల్యాణ్‌కు తొలి నుంచి కూడా పలాయనం చిత్తగించడం అలవాటేనన్నారు.

మగతనం అంటూ పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్న భాష అతడి స్థాయినే దిగజార్చేలా ఉందన్నారు. తానొక్కడినే ప్రపంచంలో నీతిమంతుడిని…. మిగిలిన వారంతా అవినీతిపరులే అన్నట్టు పవన్ మాట్లాడడం మానుకోవాలన్నారు.

వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టినప్పుడు వైఎస్‌ అభిమానుల్లో 90 శాతం మంది ఆయన వెంటే వచ్చారని… మరి జనసేన పెడితే పీఆర్పీలో చిరంజీవి వెంట ఉన్న నేతలు పవన్‌ కల్యాణ్ వెంట ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

అమరావతిలో భూముల విలువ కోట్లు పలుకుతుంటే పవన్ కల్యాణ్‌కు మాత్రం ఎకరం 20లక్షలకు లింగమనేని రమేష్‌ ఎలా రాసిచ్చారని.. దాని వెనుక ఉన్న కథ ఏంటో అందరికీ తెలుసన్నారు కన్నబాబు.

Advertisement

Similar News