అంత పెద్ద రెడ్డినని జగన్‌ చెప్పాడా....

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్…. కులం లేదు…. మతం లేదని చెబుతున్నా…. ఆయన ప్రసంగాల్లో మాత్రం పదేపదే కులం దొర్లుతూనే ఉంది. తన ప్రత్యర్థులపై కోపం ఉంటే వ్యక్తిగతంగా వారిని తిట్టడంలో తప్పులేదు కానీ… కుల రహిత సమాజం స్థాపనకు వచ్చినట్టుగా చెప్పుకునే పవన్‌ కల్యాణ్ మాత్రం తన ప్రత్యర్థుల కులాన్ని గుర్తు చేస్తూ ప్రసంగాలు చేయడమే ఆసక్తిగా ఉంది. తనకు కులం లేదని ప్రసంగాల్లో పదేపదే చెప్పే పవన్‌ కల్యాణ్… చేతల్లోకి వచ్చే సరికి తనకు […]

Advertisement
Update:2018-11-15 06:28 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్…. కులం లేదు…. మతం లేదని చెబుతున్నా…. ఆయన ప్రసంగాల్లో మాత్రం పదేపదే కులం దొర్లుతూనే ఉంది. తన ప్రత్యర్థులపై కోపం ఉంటే వ్యక్తిగతంగా వారిని తిట్టడంలో తప్పులేదు కానీ… కుల రహిత సమాజం స్థాపనకు వచ్చినట్టుగా చెప్పుకునే పవన్‌ కల్యాణ్ మాత్రం తన ప్రత్యర్థుల కులాన్ని గుర్తు చేస్తూ ప్రసంగాలు చేయడమే ఆసక్తిగా ఉంది.

తనకు కులం లేదని ప్రసంగాల్లో పదేపదే చెప్పే పవన్‌ కల్యాణ్… చేతల్లోకి వచ్చే సరికి తనకు తానే కులం రంగు పులుముకుంటున్నారు. తనకు కులం లేదని చెప్పిన పవన్‌ కల్యాణ్…. ఒకసారి అవును తాను కాపునే అని చెప్పుకున్నారు. ఇటీవల తాను రెల్ల కులం తీసుకుంటున్నానని చెప్పారు. మరోసారి తన భార్య వేరే మతం అని చెప్పుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కుళ్లు రాజకీయ తరానికి చెందని పెద్దలకు కూడా పవన్‌ పరోక్షంగా కులం అంటగట్టేస్తున్నారు.

రెండు రోజుల క్రితమే జగన్‌ మగతనం చూపించాలని కోరిన పవన్‌ కల్యాణ్… బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో పర్యటించినప్పుడు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ మగతనం చూపించాలని కోరిన పవన్‌ కల్యాణ్…. ఈసారి మాత్రం తాను సంస్కార హీనంగా మాట్లాడే వ్యక్తిని కాదని చెప్పారు. తనకు ఎలాంటి భయం లేదన్నారు.

వైఎస్‌నే ఎదురించిన వ్యక్తిని తాను అని చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా జగన్‌ ఏమైనా సురవరం ప్రతాప రెడ్డా… తరిమెల నాగిరెడ్డా… రావి నారాయణ రెడ్డా… పుచ్చలపల్లి సుందరరామి రెడ్డా…. పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డా? అని పవన్ ప్రశ్నించారు. అయితే జగన్‌ను విమర్శించేందుకు పవన్‌ కల్యాణ్ ఇలా వరుసగా ఒక సామాజికవర్గానికి చెందిన నాటి తరం పెద్దల పేర్లనే ప్రస్తావించడం ఆసక్తిగా ఉంది.

తాను పుచ్చలపల్లి , సురవరం, తరిమెల నాగిరెడ్డి లాంటి గొప్ప వ్యక్తిని అని జగన్‌ ఎప్పుడూ చెప్పుకోలేదు. మరి జగన్‌ను విమర్శించేందుకు ఒక సామాజికవర్గంలోనే పుట్టిన నేతల పేర్లను ప్రస్తావించడం ద్వారా పవన్‌ ఏం చెప్పదలుచుకున్నారు?. అన్ని వర్గాల కోసం ఆదర్శంగా నిలిచిన నాటి తరం పెద్దలకు కూడా కులాన్ని అంటగట్టడం పవన్‌ ఉద్దేశమా?. తనకు కులం లేదని చెప్పుకుంటూ ఎదుటివారిపై విమర్శలు చేస్తున్న పవన్‌ కల్యాణ్.. మరి జనసేనలో పదవుల్లో ఉన్న వారిలో దాదాపు అందరూ తన సొంత సామాజికవర్గం వారే కావడంపై ఏం సమాధానం చెబుతారో..! వారి పేర్లలో చివర ఉన్న కుల సంకేతాన్ని తీసేయమని వాళ్ళకు కూడా చెబుతాడా? ఒక పార్టీ అధినేతగా ఉంటూ నేరుగా కొన్ని కులాల పేర్లను ఎత్తి మరీ విమర్శించే వారిలో పవన్‌ మాత్రమే ముందుంటున్నారు.

వెంకటేశ్వర స్వామికి కూడా కులం తోక తగిలించిన వాళ్ళను వదిలేసి పవన్ ఇప్పుడు జగన్ కులం మీద పడ్డాడు ఎందుకో?

Advertisement

Similar News