అమాయకుడు

ఆ యువకుడు అమాయకుడు. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతనికి వున్న ఆస్తి అంతా ఒక పాడు పడిన యిల్లు. ఏవో చిన్నపనులు చేసుకుంటూ జీవించేవాడు. ఎప్పుడూ సంతోషంగా వుండేవాడు. నవ్వేవాడు,నవ్వించేవాడు. అందరికీ తలలో నాలుకలాగా మెలిగేవాడు. ఇరవయ్యేళ్ళు కూడా లేని ఆ యువకుడికి సాధువులన్నా, సన్యాసులన్నా ఎంతో భక్తి, గౌరవం. వాళ్ళ సద్బోధలు వినేవాడు. వీలయినన్ని మంచి పనులు చేసేవాడు. ఎప్పుడు ఏదీ దాచుకునేవాడు కాదు. ఆ యువకుణ్ణి ఆ వూరిలోని వ్యాపారస్థుడు ఒకడు సానుభూతిగా […]

Advertisement
Update:2018-11-14 14:30 IST
ఆ యువకుడు అమాయకుడు. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతనికి వున్న ఆస్తి అంతా ఒక పాడు పడిన యిల్లు. ఏవో చిన్నపనులు చేసుకుంటూ జీవించేవాడు. ఎప్పుడూ సంతోషంగా వుండేవాడు. నవ్వేవాడు,నవ్వించేవాడు. అందరికీ తలలో నాలుకలాగా మెలిగేవాడు.    	ఇరవయ్యేళ్ళు కూడా లేని ఆ యువకుడికి సాధువులన్నా, సన్యాసులన్నా ఎంతో భక్తి, గౌరవం. వాళ్ళ సద్బోధలు వినేవాడు.  వీలయినన్ని మంచి పనులు చేసేవాడు. ఎప్పుడు ఏదీ దాచుకునేవాడు కాదు.	ఆ యువకుణ్ణి ఆ వూరిలోని వ్యాపారస్థుడు ఒకడు సానుభూతిగా చూసేవాడు. ఒకరోజు ఆ వ్యాపారస్థుడు పిలిచి కూచో బెట్టుకుని మాటల్లోకి దించాడు.    'రోజు ఏం చేస్తావు?'    'ఏంచేస్తాను? ఎవరు ఏపని చెప్పినా చేస్తాను. వాళ్ళు యిచ్చే తృణమో పణమో తీసుకుంటాను. దాంతో సరుకులు కొని వంట చేసుకుంటాను. నాకు తినగా మిగిలింది యితరులకు పెడతాను. రాత్రికి నాయింట్లో పడుకుంటాను' అన్నాడు. నవ్వుతూ వ్యాపారస్థుడు నీకు నాయింట్లో కావలసినంత పనివుంది. నీకు నెలజీతం యిస్తాను చేస్తావా!' అన్నాడు. యువకుడు సరేనన్నాడు. పనికి కుదిరాడు.    	ఇల్లు శుభ్రం చెయ్యడం దగ్గర్నించీ సరుకులు కొనడందాకా అన్నిపనులూ ఆనందంగా చేసేవాడు. నెలజీతంలో తనకు అవసరమయింది వుంచుకుని తక్కింది పేదా సాదలకు యిచ్చేసేవాడు.    	ఒకరోజు వ్యాపారస్థుడు నెలనెలా జీతం ఏం చేస్తున్నావన్నాడు. యువకుడు తనకు అవసరమయింది వుంచుకుని తక్కింది యితరులకు యిచ్చేస్తున్నానన్నాడు. 'నువ్వు భవిష్యత్తుకోసం ఏమీ దాచుకోవా?' అన్నాడు. 'నాకు భవిష్యత్తంటే ఏమిటో తెలీదన్నాడు యువకుడు. 'కొంత దాచుకుని పెళ్ళి చేసుకో' 'పెళ్ళిఎందుకండీ' 'పిల్లలు పుడతారు, వృద్ధాప్యంలో నిన్ను చూసుకుంటారు.' 'అయితే ఆ పెళ్ళి వద్దు. మా వీధిలో ఒక ముసలావిడవుంది. ఐదుమంది కొడుకులు. కానీ ఒక్కతే వుంటుంది.' 'అందరూ అట్లా వుండరు కదా!' 'ఎవరో ఎప్పుడో చూస్తారని నేను పెళ్ళి చేసుకోను.'    	ఆ సంభాషణ అంతటితో ముగిసింది. వ్యాపారస్థుడు అనారోగ్యం పాలయి మంచమెక్కాడు. యింట్లో అందరూ ఎవరిపనుల్లో వాళ్ళు బిజీ. యువకుడొక్కడే ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పేవాడు. దైవం తనకు చివరిదశలో యిచ్చిన తోడుగా యువకుణ్ణి గురించి వ్యాపారస్థుడు అనుకున్నాడు. వ్యాపారస్థుడికి పెద్ద ఆస్తి అంతస్థులున్నాయి. వాటి గురించే ఆయన దిగులు పడేవాడు.    	యువకుడు 'అయ్యా! మీకు సంపదతో అనుబంధం. అందువల్ల ద్ణుఖమ్‌ మీతో వస్తుంది. నేను ఒంటరిని. దేని పట్లా వ్యామోహం లేనివాణ్ణి. కాబట్టి ఆనందమొక్కటే నాతో వస్తుంది. ఇది గర్వం కొద్దీ చెప్పడం లేదు. ఈ లోకంలోనివేవీ మనవి కావన్న స్పృహ నాకు వుంది. అందువల్ల నేను ఏదిపోయినా బాధపడను. ఆ కారణంగానే నన్ను జనాలు 'అమాయకుడంటారు' అన్నాడు.	యువకుడి మాటలకు వ్యాపారస్థుడి కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి. సంతోషంతో నవ్వుతూ యువకుడి చేయి పట్టుకుని వ్యాపారస్థుడు కన్ను మూశాడు.    - సౌభాగ్య    

 

Tags:    
Advertisement

Similar News