కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్ కన్నుమూత

కేంద్రమంత్రి అనంతకుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనంతకుమార్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి అమెరికాలోనూ అనంతకుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స తీసుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. అనంతకుమార్ స్వస్థలం బెంగళూరు. 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. వాజ్‌పేయి హయాంలో విమానయాన శాఖ మంత్రిగా […]

Advertisement
Update:2018-11-12 01:50 IST

కేంద్రమంత్రి అనంతకుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

అనంతకుమార్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి అమెరికాలోనూ అనంతకుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స తీసుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది.

అనంతకుమార్ స్వస్థలం బెంగళూరు. 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. వాజ్‌పేయి హయాంలో విమానయాన శాఖ మంత్రిగా అనంతకుమార్ పనిచేశారు.

ఇప్పటి వరకు ఆరు సార్లు ఎంపీగా అనంతకుమార్ గెలిచారు. అనంతకుమార్ మృతికి ప్రధానితో పాటు పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News