గెలవాలన్నా.... ఓడాలన్నా ఆఖరి 12 రోజులే కీలకం- ప్రశాంత్ కిషోర్
2019 ఎన్నికల్లోనూ తిరిగి బీజేపీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని రాజకీయ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. కాకపోతే 2014లో వచ్చినన్ని సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం లేదన్నారు. దేశంలో ఇప్పటికీ ప్రధాని మోడీయే అతి బలమైన నాయకుడని వ్యాఖ్యానించారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్… జేడీయూ చిన్నపార్టీనే అయినా దానిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం తనను ఆకర్షించిందన్నారు. తన లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు బీజేపీయే ముందుందన్నారు. ఎన్నికల్లో […]
2019 ఎన్నికల్లోనూ తిరిగి బీజేపీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని రాజకీయ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. కాకపోతే 2014లో వచ్చినన్ని సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం లేదన్నారు. దేశంలో ఇప్పటికీ ప్రధాని మోడీయే అతి బలమైన నాయకుడని వ్యాఖ్యానించారు.
ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్… జేడీయూ చిన్నపార్టీనే అయినా దానిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం తనను ఆకర్షించిందన్నారు. తన లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు బీజేపీయే ముందుందన్నారు.
ఎన్నికల్లో ఒక పార్టీ గెలవాలన్నా, ఓడాలన్నా ఆఖరి 10-12 రోజులే కీలకమని తన అనుభవంతో తెలుసుకున్నానని వివరించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీదే తిరిగి అధికారమన్నారు. దేశంలో అత్యధికమంది తలసరి ఆదాయం 100 రూపాయల లోపే ఉందని…. అలాంటి వారు ఎప్పుడు ఎవరికి ఓటేస్తారో చెప్పడం కష్టమని అందువల్లే ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలు నేతలకు షాక్ ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
2014లో స్మార్ట్ ఫోన్లు నాలుగు కోట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 40కోట్లకు చేరిందన్నారు. ప్రచారానికి సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైనదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నవాడికి చేసుకున్నంత అవకాశం ఉంటుందన్నారు. భారీ ర్యాలీ కంటే సోషల్ మీడియాలో 30 సెకన్ల వీడియోనే ప్రజలకు ఎక్కువగా చేరువ అవుతుందని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు.