ఘటోత్కచుడు

‘వివాహ భోజనంబు వింతయిన వంటకంబు వియ్యాలవారి విందు ఇయ్యాలె నాకె ముందు.. అహహ్హహ్హా… అహహ్హాహ్హా…! అని ‘మాయాబజార్‌’ సినిమాలో యస్వీ రంగారావు పాడుతూ వుంటే – ఆ అభినయం చూస్తూవుంటే నిజంగా ఘటోత్కచుణ్ని చూసినట్టే యివాల్టికీ అనిపిస్తుంది. దేవతలు ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యం లేదు. కాని రాక్షస జన్మనెత్తి మిగతా దేవతలకు దీటుగా పేరుపొందిన ఘటోత్కచుని పాత్రకూ అంతే స్థానం వుండడం విశేషం! ఘటోత్కచుడు భీముని కుమారుడు. అంటే హిడింబి అనే రాక్షస యువతికి జన్మించడం వల్ల […]

Advertisement
Update:2018-11-12 14:30 IST

‘వివాహ భోజనంబు
వింతయిన వంటకంబు
వియ్యాలవారి విందు
ఇయ్యాలె నాకె ముందు..

అహహ్హహ్హా… అహహ్హాహ్హా…! అని ‘మాయాబజార్‌’ సినిమాలో యస్వీ రంగారావు పాడుతూ వుంటే – ఆ అభినయం చూస్తూవుంటే నిజంగా ఘటోత్కచుణ్ని చూసినట్టే యివాల్టికీ అనిపిస్తుంది.

దేవతలు ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యం లేదు. కాని రాక్షస జన్మనెత్తి మిగతా దేవతలకు దీటుగా పేరుపొందిన ఘటోత్కచుని పాత్రకూ అంతే స్థానం వుండడం విశేషం!

ఘటోత్కచుడు భీముని కుమారుడు. అంటే హిడింబి అనే రాక్షస యువతికి జన్మించడం వల్ల రాక్షసగుణంగానే చెప్తారు. గుణంవల్ల సత్ప్రవర్తన కలిగిన వాడై పాండవులకు అనుయాయుడైనాడు. భక్తి ప్రపత్తులు కలిగివున్నాడు. మనం మాయాబజార్‌ సినిమాలో ఘటోత్కచుని చూసినట్టుగా పురాణాల్లోలేదు. కాని పురాణాల్లోని పాత్రకు కొనసాగింపుగా తీసుకొని అనేక సినిమాలు వచ్చాయి. అంటే ఘటోత్కచుడు మనకు అంత సన్నిహితంగా కనిపిస్తాడు. అందుకే బలరాముని కుమారై శశిరేఖను తప్పించే ప్రయత్నంలో తానే శశిరేఖగా ఘటోత్కచుడిని సరదాగా వాడుకున్నారు.

నిజానికి ఘటోత్కచుని పాత్ర చిన్నదేమీ కాదు. ద్రోణాచార్యుల వంటివారితో యుద్ధం చేసినవాడు. ఇరావంతుని చంపిన జటాసురుని కుమారుడు ఆలంబసుడిని యుద్ధంలో సంహరించింది ఘటోత్కచుడే. మహావీరుడైన కర్ణుడుకూడా ఘటోత్కచుని ముందు నిలవలేక పోయినాడు. చివరకు ఇంద్రుడిచ్చిన శక్తినంతటినీ ఉపయోగించి ఘటోత్కచుని సంహరించాడు కర్ణుడు.

అంతటి బలపరాక్రమశాలి ఘటోత్కచుడు చనిపోవడం భీముని బాధించింది. భీముని ద్ణుఖాన్ని చూసిన శ్రీకృష్ణుడు ఘటోత్కచుని మరణానికి సంతోషించ వలసిందే తప్ప బాధ పడవద్దన్నాడు. ఎందుకంటే కర్ణుడికి ఇంద్రుడిచ్చిన మహత్తర శక్తులు ఘటోత్కచుని సంహారంవల్లే ఉపసంహరించబడ్డాయని చెప్పాడు. లేదంటే కర్ణుని ఎదుర్కోవడం చాలా కష్టమని కూడా చెప్పాడు. అంచేతనే ఘటోత్కచుడు అజేయుడై ఆచంద్రతారార్కం నిలుస్తాడని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ఘోటోత్కచునిదికూడా అలాయుధాసురుల వంటి, రావణుని వంటి రాక్షస జాతికి చెందినవాడేనని, పుట్టుక చేత రాక్షసుడైనందున రాక్షససంహారం కృష్ణుడు చేయవలసివున్నదని కాని యుద్ధమున ధర్మము పక్షాన నిలిచి కీర్తిపతాక ఎగురవేసాడని పెద్దలు చెపుతారు.

– బమ్మిడి జగదీశ్వరరావు

 

 

 

 

Tags:    
Advertisement

Similar News