భారీగా వైసీపీ నెటిజన్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం

వైసీపీ సానుభూతి పరులైన నెటిజన్లపై కేసుల నమోదు ఆగడం లేదు. మెయిన్‌ స్ట్రీం మీడియాలో వైసీపీ చేతులెత్తేయడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లే ఆ పార్టీకి పెద్ద అండగా మారారు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వైసీపీ నెటిజన్లను టార్గెట్ చేస్తోంది. సోషల్‌ మీడియాలో వైసీపీ నెటిజన్ల పనిపట్టే పనిలో ఉంది. టీడీపీ నేతలను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల జగన్‌పై హత్యాయత్నం జరగ్గా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌… ఈ దాడి […]

Advertisement
Update:2018-11-08 06:19 IST

వైసీపీ సానుభూతి పరులైన నెటిజన్లపై కేసుల నమోదు ఆగడం లేదు. మెయిన్‌ స్ట్రీం మీడియాలో వైసీపీ చేతులెత్తేయడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లే ఆ పార్టీకి పెద్ద అండగా మారారు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వైసీపీ నెటిజన్లను టార్గెట్ చేస్తోంది.

సోషల్‌ మీడియాలో వైసీపీ నెటిజన్ల పనిపట్టే పనిలో ఉంది. టీడీపీ నేతలను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల జగన్‌పై హత్యాయత్నం జరగ్గా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌… ఈ దాడి వెనుక వైఎస్‌ విజయమ్మ, షర్మిల హస్తముందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నెటిజన్లు రాజేంద్రప్రసాద్‌పై విరుచుకుపడ్డారు.

రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యుల ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలోకి తీసుకొచ్చారు. దీనిపై రాజేంద్రప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనా, తన కుమార్తె పైనా పోస్టులు పెట్టిన వైసీపీ నెటిజన్లపై కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 18మంది వైసీపీ నెటిజన్లపై రాజేంద్రప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నెటిజన్లను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు చేసిన వారిలో కొందరు నెటిజన్లు విదేశాల్లో ఉన్నారు. వారిపైనా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News