ఒక్క ఓవర్లో 43 పరుగులు
న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో ప్రపంచ రికార్డు జో కార్టర్- బెన్ హాంప్టన్ బాదుడే బాదుడు క్రికెట్ మ్యాచ్ ఆరు బంతుల ఒక్క ఓవర్లో …ఆరు సిక్సర్లతో 36 పరుగుల స్కోరు సాధించడం మనకు తెలుసు. అయితే …. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ వన్డే పోటీలలో భాగంగా… హామిల్టన్ వేదికగా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ , సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు నమోదయ్యాయి. నార్ధర్న్ డిస్ట్రిక్ట్స్ జోడీ జో కార్టర్- బెన్ […]
- న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో ప్రపంచ రికార్డు
- జో కార్టర్- బెన్ హాంప్టన్ బాదుడే బాదుడు
క్రికెట్ మ్యాచ్ ఆరు బంతుల ఒక్క ఓవర్లో …ఆరు సిక్సర్లతో 36 పరుగుల స్కోరు సాధించడం మనకు తెలుసు. అయితే …. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ వన్డే పోటీలలో భాగంగా… హామిల్టన్ వేదికగా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ , సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు నమోదయ్యాయి.
నార్ధర్న్ డిస్ట్రిక్ట్స్ జోడీ జో కార్టర్- బెన్ హాంప్టన్…రెండు నోబాల్స్ తో సహా మొత్తం ఎనిమిది బాల్స్ ఎదుర్కొని…4, 6, 6, 6, 1, 6, 6, 6 షాట్లతో పరుగుల మోత మోగించారు. రెండు వైడ్స్ తో కలుపుకొని ఏకంగా 43 పరుగులు సాధించారు.
ఫాస్ట్ బౌలర్ విలియమ్ లుడిక్ బౌలింగ్ లో ఈ ఇద్దరూ ప్రపంచ రికార్డు స్కోరు సాధించారు. వివిధ దేశాల దేశవాళీ క్రికెట్లో ఇదే అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకూ జింబాబ్వే ఆటగాడు చిగుంబురా పేరుతో ఉన్న 39 పరుగులే అత్యధిక రికార్డుగా ఉంది.
ఇక..అంతర్జాతీయ వన్డే మ్యాచ్, టీ-20 మ్యాచ్ ల… ఓ ఓవర్లో ఆరుకు ఆరు బాల్స్ లోనూ సిక్సర్లు బాదిన మొనగాళ్లలో… సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్, యువరాజ్ సింగ్, భారతదేశవాళీ క్రికెట్లో రవి శాస్త్రి ఉన్నారు.