ఉనికి కోసం చింతకాయల యూ టర్న్...
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే జనం బట్టలూడదీసి కొడతారన్న టీడీపీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు యూ టర్న్ తీసుకున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీలో ఉండలేమని గ్రహించారో ఏమో గానీ అయ్యన్నపాత్రుడు స్వరం సవరించుకున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును తాజాగా సమర్ధించారు. చంద్రబాబు తరహాలోనే దేశ ప్రయోజనం అనే బ్రహ్మ పదార్థం వాడారు. గతంలో తాను కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించిన మాట వాస్తవమేనని…. కానీ రాష్ట్రానికి, దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు మరోసారి […]
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే జనం బట్టలూడదీసి కొడతారన్న టీడీపీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు యూ టర్న్ తీసుకున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీలో ఉండలేమని గ్రహించారో ఏమో గానీ అయ్యన్నపాత్రుడు స్వరం సవరించుకున్నారు.
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును తాజాగా సమర్ధించారు. చంద్రబాబు తరహాలోనే దేశ ప్రయోజనం అనే బ్రహ్మ పదార్థం వాడారు. గతంలో తాను కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించిన మాట వాస్తవమేనని…. కానీ రాష్ట్రానికి, దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు మరోసారి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌తో టీడీపీ కలవాల్సి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని చింతకాయల విమర్శించారు. తన సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు తన కుమారుడికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఎందుకు లేఖ రాశారో అర్థం కావడం లేదన్నారు.
గతంలో కాంగ్రెస్ తో పొత్తు అంటే జనం బట్టలూడదీసి తంతారని వ్యాఖ్యానించిన చింతకాయల ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటా అని చెప్పిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తే స్పందించాల్సి ఉంది.