ఎన్నికల ప్రచారానికి అల్లుఅర్జున్?
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి వార్తల్లోకి వచ్చారు. ఇబ్రహీంపట్నం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ తరపున ఆయన పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. దీపావళి వెళ్లిన తర్వాత ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసేది క్లారిటీ ఇస్తానని ప్రకటించారు. జస్ట్ మూడు రోజులు ఆగండి ఏ గుర్తుపై బరిలో ఉండేది తెలుస్తుందని చెప్పారు. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి హీరో అల్లు అర్జున్ మామ. ఆయన కూతురు స్నేహాను అల్లు అర్జున్ […]
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి వార్తల్లోకి వచ్చారు. ఇబ్రహీంపట్నం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ తరపున ఆయన పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. దీపావళి వెళ్లిన తర్వాత ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసేది క్లారిటీ ఇస్తానని ప్రకటించారు. జస్ట్ మూడు రోజులు ఆగండి ఏ గుర్తుపై బరిలో ఉండేది తెలుస్తుందని చెప్పారు.
కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి హీరో అల్లు అర్జున్ మామ. ఆయన కూతురు స్నేహాను అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రశేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. 2009 నియోజకవర్గ పునర్విభజనలో ఈ సీటు జనరల్ సీటుగా మారింది. ఇప్పటివరకూ జరిగిన రెండు ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. రెండోస్థానానికి మల్‌రెడ్డి రంగారెడ్డి పరిమితమయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.
మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ రెండు కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరపున పోటీ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ నెల 9న టికెట్ల కేటాయింపు జరిగితే చంద్రశేఖర్‌రెడ్డికి ఏ పార్టీ టికెట్ ఇచ్చేది తేలిపోతుంది. మరోవైపు ఆయన కూడా మూడు రోజుల్లో జాబితా వచ్చిన తర్వాతే పార్టీ మారే ఆలోచన చేస్తారని తెలుస్తోంది. తాను బరిలోకి దిగితే తన అల్లుడు అల్లు అర్జున్ మద్దతు ఇస్తారని….పిలిస్తే ప్రచారానికి కూడా వస్తారని శేఖర్‌రెడ్డి చెబుతున్నారు.
కంచర్ల రాకతో తమ పార్టీకి గ్లామర్ వస్తుందని కాంగ్రెస్, టీడీపీ కూడా ఆశిస్తున్నాయి. మెగా కుటుంబం ప్రచారంతో ఆయన అభిమానులు కూటమి వైపు తిరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఇబ్రహీంపట్నం రాజకీయం రసకందాయంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.