ఇలాంటి గ్యాంగులను ఏపీలోనే చూస్తున్నాం " పవన్‌ కల్యాణ్

వైసీపీ, జనసేన పార్టీలు తమను ప్రజలు గెలిపిస్తారంటూ జనానికి దగ్గరయ్యే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ తన పని తాను చేసుకుపోతోంది. అధికారం చేతిలో ఉండడంతో వైసీపీ, జనసేనను పైకి కనిపించని రీతిలో దెబ్బకొడుతోంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 జిల్లాల్లో వైసీపీ, జనసేన ఓట్లను ఊచకోత కోయిస్తోంది. ఇప్పటికే 40లక్షల ఓట్లను గల్లంతు చేసేశారు. కడప జిల్లాలో భారీగా ఓట్లను లేపేశారు. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చిన టీంలను గుంటూరులో జనసేన కార్యకర్తలు […]

Advertisement
Update: 2018-11-01 22:57 GMT

వైసీపీ, జనసేన పార్టీలు తమను ప్రజలు గెలిపిస్తారంటూ జనానికి దగ్గరయ్యే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ తన పని తాను చేసుకుపోతోంది. అధికారం చేతిలో ఉండడంతో వైసీపీ, జనసేనను పైకి కనిపించని రీతిలో దెబ్బకొడుతోంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 జిల్లాల్లో వైసీపీ, జనసేన ఓట్లను ఊచకోత కోయిస్తోంది.

ఇప్పటికే 40లక్షల ఓట్లను గల్లంతు చేసేశారు. కడప జిల్లాలో భారీగా ఓట్లను లేపేశారు. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చిన టీంలను గుంటూరులో జనసేన కార్యకర్తలు పట్టుకున్నారు. ఆసమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే పేరుతో వచ్చిన బృందాలు ఏ పార్టీకి ఓటేస్తారని సామాన్యులను అడుగుతున్నారు.

తాము వైసీపీకి గానీ, జనసేనకు గానీ ఓటేస్తామని చెబితే అంతే సంగతి. నిమిషాల్లో ఓటు గల్లంతు అవుతోంది. గుంటూరులో కొందరు తాము జనసేనకు ఓటేస్తామని చెప్పగానే సర్వే బృందం సదరు వ్యక్తుల ఫింగర్ ప్రింట్‌ తీసుకుంది. అయితే కొందరు చదువుకున్న జనసేన యువకులకు అనుమానం వచ్చి ఈసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. దాంతో 15 నిమిషాల క్రితమే మీ ఓటు తొలగించబడింది అని సమాధానం వచ్చింది.

దీంతో స్థానికులు సరదు సర్వే బృందాల వారిని పట్టుకుని నాలుగు తగిలించి విచారించగా వారంతా ఓట్లు గల్లంతు చేసే ముఠా సభ్యులని తేలింది. ఈపరిణామాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

ఇంతకాలం పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగుల గురించే విన్నామని…. ఇప్పుడు ఓట్లు ఎత్తుకెళ్లే గ్యాంగులను కూడా చూస్తున్నామని ట్విట్టర్లో విమర్శించారు. ఈ ఓట్లు ఎత్తుకెళ్లే గ్యాంగుల గురించి టీడీపీ ఏం మాట్లాడుతుందా అని తాను కూడా ఎదురుచూస్తున్నానని పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Advertisement

Similar News