పెన్ను వెళ్లలేని చోటికి కోడి కత్తి ఎలా వెళ్లింది?- మోహన్ బాబు

హత్యాయత్నం నుంచి బయటపడ్డ జగన్‌ మోహన్ రెడ్డిని సినీ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. లోటస్‌పాండ్‌లోని నివాసానికి వచ్చిన మోహన్ బాబు జగన్‌ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. ప్రజల ఆశీస్సులతోనే జగన్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం 12 జిల్లాల్లో పాదయాత్ర చేసిన నాయకుడికి ఇలా జరగడం బాధాకరమన్నారు. పెన్ను కూడా తీసుకెళ్లలేని చోటికి కత్తి ఎలా వెళ్లిందని మోహన్ బాబు ప్రశ్నించారు. నిందితుడి వెనుక […]

Advertisement
Update: 2018-11-02 11:15 GMT

హత్యాయత్నం నుంచి బయటపడ్డ జగన్‌ మోహన్ రెడ్డిని సినీ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. లోటస్‌పాండ్‌లోని నివాసానికి వచ్చిన మోహన్ బాబు జగన్‌ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. ప్రజల ఆశీస్సులతోనే జగన్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం 12 జిల్లాల్లో పాదయాత్ర చేసిన నాయకుడికి ఇలా జరగడం బాధాకరమన్నారు. పెన్ను కూడా తీసుకెళ్లలేని చోటికి కత్తి ఎలా వెళ్లిందని మోహన్ బాబు ప్రశ్నించారు. నిందితుడి వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాల్లో పోటీ మనస్తత్వం ఉండాలే గానీ ఇలాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. ఐదు నిమిషాల్లో ఎలాంటి పోస్టర్‌ను అయిన సృష్టించవచ్చన్నారు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అందరి బాధ్యత అన్నారు. జగన్‌పై దాడి జరిగిన తర్వాత టీడీపీ నేతలు కూడా చాలా మంది ఫోన్‌ చేశారని మోహన్ బాబు చెప్పారు.

జగన్‌పై దాడిని టీడీపీ నేతలు కూడా తప్పుపట్టారన్నారు. దాడి జరిగినా గొడవలు, ఆందోళనలు, ధర్నాలు, బస్సులపై దాడులు చేయడం వంటివి జరగలేదన్నారు. అలాంటివి జగన్‌కు నచ్చవన్నారు మోహన్‌ బాబు.

Advertisement

Similar News