సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుభాష్‌ రెడ్డి

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి నియమితులు కాబోతున్నారు. ప్రస్తుత గుజరాత్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న ఆర్‌ సుభాష్‌ రెడ్డి పదోన్నతిపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. సుభాష్‌ రెడ్డి పేరును సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికి సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి ఒక్కరూ లేరు. ఈనేపథ్యంలో సుభాష్ రెడ్డిని తెలంగాణ కోటాలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికి […]

Advertisement
Update:2018-11-01 02:40 IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి నియమితులు కాబోతున్నారు. ప్రస్తుత గుజరాత్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న ఆర్‌ సుభాష్‌ రెడ్డి పదోన్నతిపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. సుభాష్‌ రెడ్డి పేరును సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికి సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది.

ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి ఒక్కరూ లేరు. ఈనేపథ్యంలో సుభాష్ రెడ్డిని తెలంగాణ కోటాలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది కొలీజియం.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డేలతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై కేంద్రానికి సిఫారసు పంపించింది. నిజాయితీపరుడిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరున్న సుభాష్‌ రెడ్డి పేరుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రాష్ట్రపతి ఆమోదముద్రవేయడమే మిగిలి ఉంది.

సుభాష్‌ రెడ్డి స్వస్థలం మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామం. వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1980 అక్టోబర్‌ 30న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు.

జస్టిస్‌ బి.సుభాషణ్‌ రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు నిర్వర్తించారు.

2002 డిసెంబర్‌ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్‌ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 ఫిబ్రవరి 13న పదోన్నతిపై గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకుని ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News