చంద్రబాబు మూర్ఖుడు.... రఫేల్ కుంభకోణం కంటే పెద్దది " రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత సందీప్
చంద్రబాబు పాలనపై రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే మండిపడ్డారు. చంద్రబాబు చర్యలు మూర్ఖంగా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగ గౌరవ యాత్రలో భాగంగా జాతీయ ప్రజా ఉద్యమ వేదిక సభ్యులతో రాజధాని పల్లెల్లో ఆయన పర్యటించారు. చంద్రబాబు నిర్వాకాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామన్నారు. అమరావతిలో జరిగిన కుంభకోణం రఫేల్ కుంభకోణం కంటే పెద్దది అన్నారు. రఫేల్ కుంభకోణం 33 వేల కోట్లు అయితే అమరావతిలో భూముల పేరుతో జరిగిన కుంభకోణం 50వేల కోట్లు అని సందీప్ […]
చంద్రబాబు పాలనపై రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే మండిపడ్డారు. చంద్రబాబు చర్యలు మూర్ఖంగా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగ గౌరవ యాత్రలో భాగంగా జాతీయ ప్రజా ఉద్యమ వేదిక సభ్యులతో రాజధాని పల్లెల్లో ఆయన పర్యటించారు.
చంద్రబాబు నిర్వాకాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామన్నారు. అమరావతిలో జరిగిన కుంభకోణం రఫేల్ కుంభకోణం కంటే పెద్దది అన్నారు. రఫేల్ కుంభకోణం 33 వేల కోట్లు అయితే అమరావతిలో భూముల పేరుతో జరిగిన కుంభకోణం 50వేల కోట్లు అని సందీప్ వ్యాఖ్యానించారు.
అమరాతిలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజధాని పేరుతో పచ్చటి పొలాలను, మూడు పంటల భూములను సేకరించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. భూమి మీద ఆధారపడి బతికిన వారెవరూ రాజధానికి స్వచ్చందంగా భూములు ఇవ్వలేదని… విదేశాల్లో సెటిల్ అయిన వారే భూములు ఇచ్చారని తమ పరిశీలనలో తేలిందన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించిన ఘనత దేశంలో ఏపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. కోర్టులు అభ్యంతరం తెలుపుతున్నా సింగపూర్ కంపెనీలతో స్విస్ చాలెంజ్ విధానంలో ముందుకెళ్తుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు రైతుల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని సందీప్ పాండే అభ్యంతరం వ్యక్తం చేశారు.