శివాజీ చుట్టూ ఆపరేషన్ బిరడా!
ఆపరేషన్ గరుడ… ఈమధ్యలో టీడీపీ మీడియా ప్రచారంలో పెట్టిన పదం. హాస్య నటుడు శివాజీ చెప్పిన ఈ ఆపరేషన్‌పై తెలంగాణ పోలీసులు…. అటు కేంద్ర నిఘావర్గాలు దృష్టిపెట్టాయి. శివాజీకి ఈ ఆపరేషన్ గురించి ఎవరు చెప్పారు? ఈ ఆపరేషన్ వెనుక ఎవరు ఉన్నారు? ఆయనకు ఎక్కడి నుంచి ఈ సమాచారం వచ్చింది? ఇలాంటి సంగతులను రాబట్టబోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో శివాజీ ఉన్నారు. ఆయన హైదరాబాద్‌కు రాగానే ప్రశ్నించాలని తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలు ఎదురుచూస్తున్నాయని […]
ఆపరేషన్ గరుడ… ఈమధ్యలో టీడీపీ మీడియా ప్రచారంలో పెట్టిన పదం. హాస్య నటుడు శివాజీ చెప్పిన ఈ ఆపరేషన్‌పై తెలంగాణ పోలీసులు…. అటు కేంద్ర నిఘావర్గాలు దృష్టిపెట్టాయి. శివాజీకి ఈ ఆపరేషన్ గురించి ఎవరు చెప్పారు? ఈ ఆపరేషన్ వెనుక ఎవరు ఉన్నారు? ఆయనకు ఎక్కడి నుంచి ఈ సమాచారం వచ్చింది? ఇలాంటి సంగతులను రాబట్టబోతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో శివాజీ ఉన్నారు. ఆయన హైదరాబాద్‌కు రాగానే ప్రశ్నించాలని తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలు ఎదురుచూస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా తెలంగాణలో కూడా ఏమైనా కుట్రలు చేయబోతున్నారా? ఎన్నికల వేళ ఎమైనా అలజడులు సృష్టించబోతున్నారా? అనే విషయాలపై శివాజీని ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అలజడి సృష్టించేందుకు బీజేపీ నేతలు ఆపరేషన్ గరుడ చేపట్టారని శివాజీ ఇంతకుముందు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అరగంట వీడియోలో ఇంతకుముందు మ్యాప్‌ల ద్వారా తెలిపారు. ఐటీదాడులు, హత్యాయత్నాలు విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు జగన్‌పై హత్యాయత్నంతో పాటు ఐటీదాడులు కూడా కొనసాగుతుండడంతో ఈ విషయాలపై ఆయన్ని ప్రశ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈవిషయాలను పసిగట్టిన శివాజీ ఇప్పట్లో అమెరికా నుంచి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్య ఏ ప్రెస్‌మీట్ పెట్టినా హైదరాబాద్‌లో పెట్డడం లేదు. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. ఆపరేషన్ గరుడ వీడియో కూడా హైదరాబాద్‌లో చిత్రీకరించి…. విజయవాడలో మీడియాకు పంపించినట్లు సమాచారం.
మొత్తానికి ఆపరేషన్ గరుడపై ప్రశ్నించి శివాజీకి బిరడా బిగించాలని పోలీసులు రెడీ అయినట్లు తెలుస్తోంది. రేపోమాపో ఆయనకు నోటీసులు కూడా ఇస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది.