ఈ ఉత్తరం ఎవరు రాశారు?

ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి మీద నిన్న మధ్యాహ్నం విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేసిన శ్రీనివాస రావు జేబులో 11 పేజీల ఉత్తరం దొరికిందని డీజీపీ ప్రకటించాడు. అయితే ఆ ఉత్తరాన్ని, అందులో విషయాలను చాలా గంటల దాకా బయటపెట్టలేదు. ఇప్పుడు ఆ ఉత్తరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆశ్చర్యం ఏమిటంటే అన్ని పేజీలలోని చేతి రాత ఒకటిగా లేదు. హత్యా ప్రయత్నం చేయడానికి ముందే ఆ ఉత్తరం రాసి జేబులో దాచుకున్నాడని డీజీపీ చెబుతున్నాడు. […]

Advertisement
Update: 2018-10-25 23:22 GMT

ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి మీద నిన్న మధ్యాహ్నం విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేసిన శ్రీనివాస రావు జేబులో 11 పేజీల ఉత్తరం దొరికిందని డీజీపీ ప్రకటించాడు. అయితే ఆ ఉత్తరాన్ని, అందులో విషయాలను చాలా గంటల దాకా బయటపెట్టలేదు. ఇప్పుడు ఆ ఉత్తరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఆశ్చర్యం ఏమిటంటే అన్ని పేజీలలోని చేతి రాత ఒకటిగా లేదు.

హత్యా ప్రయత్నం చేయడానికి ముందే ఆ ఉత్తరం రాసి జేబులో దాచుకున్నాడని డీజీపీ చెబుతున్నాడు. అయితే ఆ ఉత్తరం పేజీలు ఒక్క మడత కూడా పడలేదు. నలగలేదు.పదకొండు పేజీలను మడవకుండా ఎలా జేబులో పెట్టుకున్నాడో ఆశ్చర్యం కలుగుతోంది.

ఎవరో అప్పుడే రాసి ఫొటో తీసినట్లు ఉన్నాయి పేజీలు. కాగితం నలగకుండా, మడత పడకుండా ఎలా జేబులో దాచుకోగలిగాడు? అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

దీని మీద నెటిజన్‌లు జోకులు వేస్తున్నారు. అతని జేబులోని పేపర్లను పోలీస్‌ స్టేషన్‌లో ఇస్త్రీ చేశారా? టైం తీసుకుని లెటర్‌ అయితే రాయించగలిగారు గానీ అన్ని పేజీలను ఒక్కళ్ళ చేతనే రాయించలేక పోయారా? అని నెటిజన్‌లు వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. అందులో విషయాలు, రాసిన పద్దతి ఒక ఇంటర్‌మీడియట్‌ డ్రాప్‌ అవుట్‌ స్టూడెంట్‌ రాసినట్లు లేవని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Similar News