డీజీపీకి విజయసాయి రెడ్డి సూటి ప్రశ్న.....

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోనే కత్తితో దాడి జరిగిందంటే దాని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కుట్ర వెనుక ఎవరున్నారో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్‌ భద్రతను కట్టుదిట్టం చేయాలని గతంలోనే తాము అనేక విజ్ఞప్తులు ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. చివరకు జగన్‌ ప్రయాణించే వాహనాలు కూడా పదేపదే మొరాయిస్తున్నాయని… […]

Advertisement
Update: 2018-10-25 07:55 GMT

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోనే కత్తితో దాడి జరిగిందంటే దాని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

కుట్ర వెనుక ఎవరున్నారో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్‌ భద్రతను కట్టుదిట్టం చేయాలని గతంలోనే తాము అనేక విజ్ఞప్తులు ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. చివరకు జగన్‌ ప్రయాణించే వాహనాలు కూడా పదేపదే మొరాయిస్తున్నాయని… అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని దాని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఇదేనా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానేనని, పబ్లిసిటీ కోసమే ఇది చేశారని డీజీపీ చెప్పడం బట్టి ఈ వ్యవహారాన్ని నీరు గార్చే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్‌పై ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది కాబట్టి అది తమ పరిధిలోకి రాదని డీజీపీ చెప్పడాన్ని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు.

ఎయిర్‌పోర్టు తమ పరిధిలోకి రాదంటున్న డీజీపీ మరి ప్రత్యేక హోదా ర్యాలీలో పాల్గొనేందుకు జగన్‌ విశాఖ వెళ్లినప్పుడు రాష్ట్ర పోలీసులు మఫ్టీలో ఎయిర్‌ పోర్టులోకి ప్రవేశించి రన్‌వే పైనే అడ్డుకున్నది నిజం కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Similar News