పవన్.... ఆమెకు ఇక్కడ ఇమేజ్ ఉందంటావా?
ఉన్నఫళంగా బీఎస్పీ తో మిత్రబంధం నెరపడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ పార్టీతో పవన్ దోస్తీ చర్చలు చేస్తున్నాడని స్పష్టం అవుతోంది. ప్రత్యేకంగా యూపీ పర్యటనకు వెళ్లి పవన్ కల్యాణ్ బీఎస్పీతో సంధీ యత్నాలు చేస్తున్నాడు. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయవతి అని వేరే చెప్పనక్కర్లేదు. బీఎస్పీ అధినేత్రిగా దళిత రాజకీయాల్లో ఆరితేరారు మాయవతి. అయితే ఆమె శక్తి అంతా యూపీకి, ఆ పక్కనే ఉన్న రెండు మూడు రాష్ట్రాలకు పరిమితం. […]
ఉన్నఫళంగా బీఎస్పీ తో మిత్రబంధం నెరపడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ పార్టీతో పవన్ దోస్తీ చర్చలు చేస్తున్నాడని స్పష్టం అవుతోంది. ప్రత్యేకంగా యూపీ పర్యటనకు వెళ్లి పవన్ కల్యాణ్ బీఎస్పీతో సంధీ యత్నాలు చేస్తున్నాడు.
యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయవతి అని వేరే చెప్పనక్కర్లేదు. బీఎస్పీ అధినేత్రిగా దళిత రాజకీయాల్లో ఆరితేరారు మాయవతి. అయితే ఆమె శక్తి అంతా యూపీకి, ఆ పక్కనే ఉన్న రెండు మూడు రాష్ట్రాలకు పరిమితం. ఆ రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ ఏమీ సత్తా చాటేది లేదు. జస్ట్ పోటీ చేస్తుంటుందంతే. రెండు మూడు శాతం ఓట్లు వస్తూ ఉంటాయి. వాటితో ఆమె సాధించేది ఏమీ ఉండదు.
యూపీలో కూడా ఇప్పుడు మాయవతి పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. మారిన రాజకీయ సమీకరణాల్లో బీజేపీ ఆ రాష్ట్రంలో దుమ్మురేపేసింది. ఇక రెండో స్థానంలో ఎస్పీ నిలుస్తోంది. బీఎస్పీ అక్కడ కేవలం దళితుల్లోని ఒక వర్గం పార్టీగా మిగిలిపోయింది.
ఇక దక్షిణాది విషయానికి వస్తే మాయవతికి ఇక్కడ పెద్దగా గుర్తింపు లేదు. ఆమె ఎవరో కూడా నిరక్షరాస్యులకు, జనసామాన్యానికి తెలియదు.
అయితే ఇప్పుడు పవన్ ఏపీలో దళితుల ఓట్ల మీద గురి పెట్టాడు. అందుకే బీఎస్పీతో పొత్తు యత్నాల్లో ఉన్నట్టుగా ఉన్నాడు. మరి దీని కోసం యూపీ వరకూ వెళ్లడం అయితే బాగానే ఉంది కానీ.. ఆల్రెడీ అవినీతి విషయంలో మాయవతికి పెద్ద ర్యాంకే ఉంది.
ఇక పాలన విషయంలోనూ విమర్శలే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి తన విగ్రహాలను, తన పార్టీ గుర్తును విగ్రహాలుగా పెట్టుకొంటూ విమర్శల పాలయ్యారామె. ఆ తీరుతోనే ఓటమి పాలయ్యారు. ఆమెను పవన్ నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇదేమైనా వర్కవుట్ అయ్యే పనేనా?