నాగేశ్వరరావు వెనుక చక్రం తిప్పిన వెంకయ్య అండ్ ఎల్లో గ్యాంగ్
సీబీఐలో ఏర్పడిన సంక్షోభం సంచలనం సృష్టించింది. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య పోరుతో ఇద్దరు అధికారులు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈపరిణామాన్ని సృష్టించింది టీడీపీ లాబీయింగేనని సీబీఐలోని ఉన్నతాధికారులే మీడియా ప్రతినిధుల వద్ద చెప్పి వాపోతున్నారు. సీబీఐని తమపై ఎక్కడ ఉసిగొల్పుతారోనన్న అనుమానంతో చంద్రబాబు డైరెక్షన్‌లో ఇద్దరు టీడీపీ రాజ్యసభ ఎంపీలు సీబీఐ కేంద్ర కార్యాలయంలో తిష్టవేసి మొత్తం కథ నడిపారు. ఇద్దరు ఉన్నతాధికారులు సెలవుపై వెళ్లగానే తమకు అత్యంత అనుకూలుడైన మన్నెం నాగేశ్వరరావును సీబీఐ […]
సీబీఐలో ఏర్పడిన సంక్షోభం సంచలనం సృష్టించింది. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య పోరుతో ఇద్దరు అధికారులు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈపరిణామాన్ని సృష్టించింది టీడీపీ లాబీయింగేనని సీబీఐలోని ఉన్నతాధికారులే మీడియా ప్రతినిధుల వద్ద చెప్పి వాపోతున్నారు.
సీబీఐని తమపై ఎక్కడ ఉసిగొల్పుతారోనన్న అనుమానంతో చంద్రబాబు డైరెక్షన్‌లో ఇద్దరు టీడీపీ రాజ్యసభ ఎంపీలు సీబీఐ కేంద్ర కార్యాలయంలో తిష్టవేసి మొత్తం కథ నడిపారు. ఇద్దరు ఉన్నతాధికారులు సెలవుపై వెళ్లగానే తమకు అత్యంత అనుకూలుడైన మన్నెం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్ పోస్టుకు చేరేలా పావులు కదిపారు. మన్నెం నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి.
ఇతడి అవినీతి బాగోతాలపై గతంలోనే తమిళ మీడియాలో భారీ కథనాలు వచ్చాయి. ఇలాంటి వ్యక్తి సీబీఐలోకి ఎంటరైంది అప్పటి కేంద్రమంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతోనే అని గతంలోనే తమిళ మీడియా కథనాలు రాసింది. ఒకే సామాజికవర్గం అవడం కూడా నాగేశ్వరరావుకు కలిసి వచ్చింది.
అత్యంత అవినీతి పరుడైనప్పటికీ నాగేశ్వరరావు సీబీఐలోకి రావడం వెనుక వెంకయ్యనాయుడు హస్తముందని ఒక తమిళ మీడియా నేరుగానే కథనాన్ని ప్రచురించింది. ఇతడి అవినీతి ఆరోపణలపై సీబీఐకి చెడ్డపేరు వస్తుండడంతో చర్యలు తీసుకోవాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సిఫార్సు చేశారు.
కానీ సీవీసీ చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన కేవీ చౌదరి ఉన్నారు. ఆయన ఆశీస్సులతోనే నాగేశ్వరరావు చర్యల నుంచి తప్పించుకున్నారని తమిళ మీడియా చెబుతోంది.
అన్నింటికి మించి ఆశ్చర్యం ఏమిటంటే… అవినీతి ఆరోపణలు ఉన్న నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తే… కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తాము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సుతోనే ఆయన్ను నియమించామని సెలవిచ్చారు. దీన్ని బట్టి చంద్రబాబు గ్యాంగ్ ఒక పద్దతి ప్రకారం దేశ రాజధానిలో తిష్టవేసి అన్ని వ్యవస్థల్లోకి చొరబడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
అవినీతి ఆరోపణలు ఉన్న మన్నెం నాగేశ్వరరావు సీబీఐలోకి ఎంటరయ్యేందుకు వెంకయ్యనాయుడు సహకరిస్తే… సీబీఐ ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రాజేసి వారిని బయటకు వెళ్లేలా టీడీపీ రాజ్యసభ ఎంపీలు పావులు కదిపారు. ఆ తర్వాత సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎవరిని నియమించాలన్న చర్చ వచ్చినప్పుడు కేవీ చౌదరి ఆధ్వర్యంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవినీతి పరుడైన మన్నెం నాగేశ్వరరావును సిఫార్సు చేసిందని ఆరోపణలు వస్తున్నాయి.
పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమించాలంటే ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని కొలీజియం అంగీకరించాల్సి ఉంటుంది. కానీ తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్న మన్నెం నాగేశ్వరరావు పేరును ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూడా నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణల దృష్ట్యా అంగీకారం తెలపకపోవచ్చు. అందుకే ఇలా చంద్రబాబు ముఠా చక్రం తిప్పి తాత్కాలికంగా మన్నెం నాగేశ్వరరావును సీబీఐ పీఠంపై కూర్చోబెట్టింది.