సీబీఐ డైరెక్టర్ ఇంటి వద్ద ఆగంతకులు.... ఈడ్చుకెళ్లిన భద్రతా సిబ్బంది
సీబీఐలో అనూహ్యపరిణామాల పర్వం కొనసాగుతోంది. మాట వినడం లేదని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం… ఆయనపై డేగ కన్ను వేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న అలోక్ వర్మ నివాసంపై నిఘా ఉంచారు. వర్మ ఇంటి వద్ద నలుగురు అనుమానాస్పదంగా సంచరించారు. వర్మ ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన అలోక్ వర్మ భద్రతా సిబ్బంది వారిని వెంటాడి పట్టుకున్నారు. అనంతరం ఈడ్చుకెళ్లారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. […]
సీబీఐలో అనూహ్యపరిణామాల పర్వం కొనసాగుతోంది. మాట వినడం లేదని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం… ఆయనపై డేగ కన్ను వేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న అలోక్ వర్మ నివాసంపై నిఘా ఉంచారు.
పోలీసులు వారిని లోనికి ఈడ్చుకెళ్లి విచారించగా తాము ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బందిమని వివరించారు. ఐడీ కార్డులు కూడా చూపించారు. దీంతో అలోక్ వర్మను కేంద్ర ప్రభుత్వం ఇంకా వెంటాడుతోందన్న ఆరోపణలు ఊపందుకున్నాయి.
అలోక్ వర్మకు ప్రతిపక్షాలు, వివిధ సంఘాలు మద్దతుగా నిలుస్తుండడంతో ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారు అన్నది తెలుసుకునేందుకే మోడీ సర్కార్ ఈ నిఘా ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.