జగన్‌ ను సేవ్‌ చేసిన మధు పిలుపు

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వైసీపీ నేత మల్లా విజయప్రసాద్‌ చెప్పిన దాని ప్రకారం…. జగన్‌ కాఫీ తాగుతున్న సమయంలో సిబ్బంది వచ్చి విమానానికి టైం అయింది సర్‌ రండి అంటూ పిలిచారు. దీంతో జగన్‌ వెళ్లేందుకు పైకి లేచి ఒక అడుగు ముందుకేశారు. అప్పటి వరకు దాడి చేసిన శ్రీనివాస రావు కొంచెం దూరంలో ఒక వాటర్ బాటిల్‌ పట్టుకుని నిలబడ్డారు. జగన్‌ లేచి వెళ్లేందుకు […]

Advertisement
Update: 2018-10-25 09:04 GMT

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వైసీపీ నేత మల్లా విజయప్రసాద్‌ చెప్పిన దాని ప్రకారం…. జగన్‌ కాఫీ తాగుతున్న సమయంలో సిబ్బంది వచ్చి విమానానికి టైం అయింది సర్‌ రండి అంటూ పిలిచారు. దీంతో జగన్‌ వెళ్లేందుకు పైకి లేచి ఒక అడుగు ముందుకేశారు.

అప్పటి వరకు దాడి చేసిన శ్రీనివాస రావు కొంచెం దూరంలో ఒక వాటర్ బాటిల్‌ పట్టుకుని నిలబడ్డారు. జగన్‌ లేచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో శ్రీనివాస్ రావు ఒక్కసారిగా జగన్‌ వద్దకు వచ్చి కత్తితో మెడపై పొడిచేందుకు ప్రయత్నించాడు.

అదే సమయంలో శ్రీకాళహస్తి వైసీపీ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూధన్‌ రెడ్డి… విజయవాడ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని పరిచయం చేసేందుకు జగన్‌ను పిలిచారు. దీంతో జగన్‌ ఒక్కసారిగా మధు వైపు తిరిగారు. దాంతో మెడపై పడాల్సిన వేటు భుజంపై పడింది. కత్తి లోతుగా దిగింది.

అప్పటి వరకు అతడి వద్ద కత్తి ఉందన్న విషయాన్ని కూడా గమనించలేకపోయారు. తొలి వేటు భుజంపై పడడంతో వెంటనే మరోసారి పొడిచేందుకు ప్రయత్నించగా…. అక్కడే ఉన్న కరణం ధర్మశ్రీ, మల్లా విజయప్రసాద్‌ శ్రీనివాస్‌ను తోసిపడేశారు.

వెంటనే అక్కడికి వచ్చిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. శ్రీనివాస రావు పనిచేస్తున్న క్యాంటీన్‌ ఓనర్‌ తొట్టంపూడి హర్షవర్థన్ … మంత్రి నారా లోకేష్‌కు చాలా సన్నిహితంగా ఉంటారని…. గాజువాక టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారని మల్లా విజయప్రసాద్‌ వివరించారు.

విజయవాడ వ్యక్తిని పరిచయం చేసేందుకు జగన్‌ను బియ్యపు మధుసూధన్ రెడ్డి పిలిచి ఉండకపోతే కత్తిపోటు నేరుగా జగన్‌ మెడపైనే పడేదని…. ఆ కత్తి చాలా పదునుగా ఉందని ఆయన వివరించారు. దాడి చేసిన తర్వాత నేను ఈ రోజు కోసం ఐదు నెలలుగా ఎదురు చూస్తున్నా… నన్ను అరెస్ట్ చేయండి అంటూ శ్రీనివాస రావు కేకలు వేశారని కరణం ధర్మశ్రీ వివరించారు.

Advertisement

Similar News