నాగేశ్వర రావు ఆధ్వర్యంలో...... సీబీఐ కేంద్ర కార్యాలయంలో సీబీఐ దాడులు
దేశంలో వ్యవస్థలు నాశనం అయిన తీరుకు ఇదే నిదర్శనం. ఇప్పటి వరకు సీబీఐ ఇతరులపై దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తన కార్యాలయంలోనే సోదాలు నిర్వహిస్తోంది. సీబీఐలోని ఉన్నతాధికారులతో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఒక టీడీపీ కేంద్ర మాజీ మంత్రి దోస్తి వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంలో నిందితుల వాంగ్మూలాల వ్యవహారంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరు బయటకు రావడం, సీబీఐ ఉన్నతాధికారులు ఒకరినొకరు ఇరికించుకునే ప్రయత్నం చేయడం జరిగిపోయాయి. దీంతో సీబీఐ డైరెక్టర్ […]
దేశంలో వ్యవస్థలు నాశనం అయిన తీరుకు ఇదే నిదర్శనం. ఇప్పటి వరకు సీబీఐ ఇతరులపై దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తన కార్యాలయంలోనే సోదాలు నిర్వహిస్తోంది. సీబీఐలోని ఉన్నతాధికారులతో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఒక టీడీపీ కేంద్ర మాజీ మంత్రి దోస్తి వెలుగులోకి వచ్చింది.
ఇదే విషయంలో నిందితుల వాంగ్మూలాల వ్యవహారంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరు బయటకు రావడం, సీబీఐ ఉన్నతాధికారులు ఒకరినొకరు ఇరికించుకునే ప్రయత్నం చేయడం జరిగిపోయాయి. దీంతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను లీవ్‌పై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
తాత్కిలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించారు. ఆ వెంటనే నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే సీబీఐ కేంద్ర కార్యాలయంలో సోదాలు మొదలయ్యాయి. లీవ్‌పై వెళ్లిన డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల చాంబర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
స్పెషల్ డైరెక్టర్ అస్తానా, డీఎస్పీ దేవేందర్ తదితరుల చాంబర్లలో రికార్డులను తనిఖీ చేస్తున్నారు. సీబీఐ కార్యాలయంలోని 10, 11 అంతస్తుల్లోని చాంబర్లల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.