"ఖాకీ" సినిమా సిక్వెల్ లో హీరోగా మహేష్ బాబు ?

తెలుగు లో ఇప్పటి వరకు సిక్వెల్ గా వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఒక్క బాహుబలి పార్ట్ 2 సినిమాని మినహాయిస్తే తప్ప మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్స్ ని నమోదు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఒక కోలీవుడ్ సినిమా సిక్వెల్ లో తెలుగు హీరోని పెట్టి తీయాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే తమిళ్ లో గత ఏడాది రిలీస్ […]

Advertisement
Update:2018-10-24 03:59 IST
"ఖాకీ" సినిమా సిక్వెల్ లో హీరోగా మహేష్ బాబు ?
  • whatsapp icon

తెలుగు లో ఇప్పటి వరకు సిక్వెల్ గా వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఒక్క బాహుబలి పార్ట్ 2 సినిమాని మినహాయిస్తే తప్ప మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్స్ ని నమోదు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఒక కోలీవుడ్ సినిమా సిక్వెల్ లో తెలుగు హీరోని పెట్టి తీయాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

అసలు విషయం ఏంటంటే తమిళ్ లో గత ఏడాది రిలీస్ అయిన “ఖాకీ” సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచింది అనేది అందరికి తెలిసిన విషయమే. కార్తీ హీరోగా హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆధారనపొందింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సిక్వెల్ తీయాలి అనే ప్లాన్ లో మూవీ యూనిట్ ఉన్నారు.

కానీ ఈ సిక్వెల్ కథలో కార్తీ హీరోగా ఉండడు, కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసమే సిక్వెల్ కథని రెడి చేసుకుంటున్నాడు దర్శకుడు. ఎందుకంటే “ఖాకీ” సినిమా రిలీజ్ టైం లో ఆ సినిమా హిట్ టాక్ మీ తెలుసుకొని మరి మహేష్ బాబు డైరెక్టర్ ని అభినందించాడట. అభినందించడమే కాకుండా కథ రెడి చేసుకో అని కూడా చెప్పాడు అంత మహేష్ బాబు. మరి “ఖాకీ” సినిమా ఆ రేంజ్ లో నచ్చింది మహేష్ బాబుకి. ఇక డైరెక్టర్ కూడా స్వయానా సూపర్ స్టార్ ఏ పిలిచాడు కాబట్టి మహేష్ బాబుకి సిక్వెల్ కథని రెడి చేసాడు అంట. మరి ఈ కథని దర్శకుడు మహేష్ బాబు కి ఎప్ప్పుడు వినిపిస్తాడో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మహేష్ బాబు వంశీ పైడిపల్లి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News