ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి ఏపీలో జరుగుతోంది
ఏపీలో చంద్రబాబు పాలనకు బీహార్ లో నడిచిన లాలూ పాలనకు ఏమాత్రం తేడా లేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఏపీలో లాలూ తరహాలోనే లాలూచీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అవినీతి పరులంతా కలిసి కుమ్మక్కు రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారన్నారు. అమరావతి బాండ్ల పేరుతో అధిక వడ్డీకి వెయ్యి కోట్లు తెచ్చారని.. కానీ ఆ బాండ్లు కొన్న వారి పేర్లను చెప్పేందుకు కూడా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన వారు, టీడీపీ ప్రభుత్వంలో భూములు […]
ఏపీలో చంద్రబాబు పాలనకు బీహార్ లో నడిచిన లాలూ పాలనకు ఏమాత్రం తేడా లేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఏపీలో లాలూ తరహాలోనే లాలూచీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అవినీతి పరులంతా కలిసి కుమ్మక్కు రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారన్నారు. అమరావతి బాండ్ల పేరుతో అధిక వడ్డీకి వెయ్యి కోట్లు తెచ్చారని.. కానీ ఆ బాండ్లు కొన్న వారి పేర్లను చెప్పేందుకు కూడా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
టీడీపీకి చెందిన వారు, టీడీపీ ప్రభుత్వంలో భూములు సొంతం చేసుకున్న వారే ఈ బాండ్లను కొనేశారని చెప్పారు. అందరూ కలిసి ఒక మాఫియాగా మారి టీడీపీ నేతలు దోచుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. 2019లో అధికారంలోకి రాలేమన్న నిర్ధారణకు రావడం వల్లే టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
లక్షల మంది కష్టపడి సంపాదించి అగ్రిగోల్డ్‌లో పెడితే వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు… తిరిగి వేల ఎకరాల అగ్రిగోల్డ్ భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎందుకు తరగిపోతున్నాయని ప్రశ్నించారు. ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత అవినీతి గ్లోబల్ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతోందన్నారు.