ఏకనాధుడు (భక్తి)
ఏకనాధుణ్ణి ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నించీ సేవించే వాడు. అతన్ని శిష్యునడవచ్చు. అతనికి ఎప్పుడూ ఏవో సదేహాలు కలుగుతూండేవి. అతను నిత్యశంకితుడనవచ్చు. ఆ వ్యక్తి ఒక రోజు ఏకనాధుడితో స్వామీ మనిషన్నవాడు మీ అంత నిర్మలంగా, పవిత్రంగా ఉంటాడని నేననుకోను. ఒకోసారి నాలో గొప్ప సందేహం మెదుల్తూ ఉంటుంది. అదేమిటంటే మీలో కనిపించే పవిత్రత అంతా పైపైదేనేమో! మీ మనసులో లోలోతుల్లో కోరికలు దాగి ఉన్నాయేమో! మీలో […]
Advertisement
ఏకనాధుణ్ణి ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నించీ సేవించే వాడు. అతన్ని శిష్యునడవచ్చు. అతనికి ఎప్పుడూ ఏవో సదేహాలు కలుగుతూండేవి. అతను నిత్యశంకితుడనవచ్చు. ఆ వ్యక్తి ఒక రోజు ఏకనాధుడితో స్వామీ మనిషన్నవాడు మీ అంత నిర్మలంగా, పవిత్రంగా ఉంటాడని నేననుకోను. ఒకోసారి నాలో గొప్ప సందేహం మెదుల్తూ ఉంటుంది. అదేమిటంటే మీలో కనిపించే పవిత్రత అంతా పైపైదేనేమో! మీ మనసులో లోలోతుల్లో కోరికలు దాగి ఉన్నాయేమో! మీలో తీవ్ర వాంఛ అదృశ్య రూపంలో ఉండేమో! లోలోతుల్లో మీ స్వప్నాల్లో మీరు పాపం చేస్తున్నారేమో! దయ చేసి నా సంశయాల్ని నివృత్తి చేయండి. ఎందుకంటే అది మనిద్దరి మధ్యా అడ్డంకిగా ఉంది. అడ్డుగోడగా ఉంది.
ఏకనాధుడు నవ్వి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు.
ఒక రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి వచ్చి రాత్రంతా నిద్ర లేదు. ఇంత నిర్మలంగా, ప్రశాంతంగా మీరు కనిపిస్తున్నారు. కానీ నేను నమ్మలేకపోతున్నాను. నేను పవిత్రుడైన దేవుణ్ణి నమ్ముతాను. కానీ ఈ శరీరాన్ని మనసును సృష్టించింది ఆ దేవుడే కదా! ఈ శరీరం కాంక్షతో నిండింది. అచేతనలో ఆకాంక్షలు నిండి ఉన్నట్టు అనిపిస్తాయి అన్నాడు.
ఏకనాధుడు నవ్వ లేదు. దానికి భిన్నంగా గంభీరంగా కనిపించాడు. ఆ వ్యక్తితో చూడు మిత్రమా! ఎప్పట్నించో ఒక విషయం నీకు చెబుదామని అనుకుటూ మరచిపోతున్నాను. నువ్వు చెయ్యి కదిలిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ విషయం గుర్తొచ్చింది. అది నువ్వు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నాడు.
ఆ వ్యక్తి అంత ముఖ్యమైందా! అన్నాడు.
ఏకనాధుడు అవును. చాలా ముఖ్యమైంది. నీకు సంబంధించినది. ఏమంటే నేను ఒకసారి నీ చేతిలో రేఖలు చూశాను. అవి నీ వయసును తెలిపాయి. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చెబుదాములే, ఇప్పుడు ఎందుకు చెప్పడం అని ఊరుకున్నాను. ఇప్పుడు సందర్బం వచ్చింది. అదేమిటంటే నీ చేతి రేఖల్ని బట్టి నువ్వు ఇంక వారం రోజులు మాత్రమే బతుకుతావు. ఈ రోజు ఆదివారం. వచ్చే ఆదివారం దాకా నువ్వు జీవిస్తావు. సరే! ఆ సంగతి అలా ఉంచి ఇప్పుడు నీ సందేహాలకు సమాధానమిస్తాను. అన్నాడు.
ఆ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి ఒక్కసారిగా దిగులుపడిపోయాడు. నీరసించిపోయాడు. వెంటనే లేచి ఇంటి దారి పడ్డాడు.
మనం చర్చించుకుంటున్న విషయం అన్నాడు. ఏకనాధుడు
ఈ వ్యక్తి ఇప్పుడు అవన్నీ పనికి మాలినవి. నేను వారం రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటానన్న విషయంతో పోలిస్తే అవి అర్థం లేనివి. అని ఇంటికి వెళ్లాడు. గంటలోనే మనిషి ఉత్సాహం తగ్గిపోయింది. పడక మీద పడిపోయాడు. వచ్చే ఆదివారం సూర్యాస్తమయ్యే సమయానికి తను భూమి మీద ఉండనన్న విషయం తలచుకుని వణికిపోయాడు. రెండు రోజులు, మూడు రోజులు గడిచిపోయాయి మూడు రోజులకే మనిషి సగమైపోయాడు. మొఖంలో నవ్వు లేదు. భార్యని బిడ్డల్ని గుర్తుపట్టని స్థితికి వచ్చాడు. వారం గడిచింది. ఆదివారం వచ్చింది. మధ్యాహ్న సూర్యుడు పడమటి వైపు దిగుతున్నాడు. ఆ మనిషి కళ్లల్లో మృత్యుచ్ఛాయలు కనిపించాయి. మాటలు బయటకు రావటం లేదు. చలనం లేదు.
అప్పుడు హఠాత్తుగా వాళ్ల ఇంటికి ఏకనాధుడు వచ్చాడు. ఏకనాధుడు అతన్ని చూసి ఎలా ఉన్నావన్నాడు. అతను నా చావు దగ్గర పడుతోందన్నాడు.
ఏకనాధుడు అదంతా మరచిపో. ఇప్పుడు నీ మనసులో ఈర్ష్య, ద్వేషం, కోపం, తీవ్ర వాంఛ ఇవన్నీ అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయా? అన్నాడు.
అతను నేను చావు చివరి అంచులో ఉన్నాను. ఈ ప్రశ్నలు అవసరమా? ఇవన్నీ ఎంతో అసంగతమనిపిస్తున్నాయి అన్నాడు.
ఏకనాధుడు నువ్వేవమీ చనిపోవు. లేచి కూచో. నువ్వు అప్పుడు వేసిన ప్రశ్నకు ఇదే జవాబు. ఎప్పుడు మనలో మరణ స్పృహ కలుగుతుందో అప్పుడు మన చైతన్యం మేలుకుంటుంది. నేను నువ్వు వారం బతుకుతావని అబద్ధం చెప్పాను. కానీ ఏడురోజులు బతికినా డెబ్బయి సంవత్సరాలు బతికినా మరణం అనివార్యం. ఈ జీవితం నీ చేతుల్లో లేదని ఒకసారి నువ్వు గ్రహిస్తే నువ్వు ఆవలి తీరం కోసం సిద్ధపడతావు. ప్రపంచాన్ని మించిన దాని కోసం పరితపిస్తావు అన్నాడు.
-సౌభాగ్య
Advertisement