గొడవకు సిద్ధమైన మారుతి

ప్రేమకథా చిత్రమ్.. అన్నీ తానై మారుతి తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు మారుతినే కథ అందించాడు. స్కీన్ ప్లే తనే రాశాడు. మాటలు కూడా ఇచ్చాడు. వీటితో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అతడిదే. సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. సరిగ్గా ఇక్కడే మారుతికి కోపం తన్నుకొచ్చింది ప్రేమకథా చిత్రమ్ సినిమాను తెరకెక్కించిన ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలే దానికి […]

Advertisement
Update:2018-10-20 10:25 IST

ప్రేమకథా చిత్రమ్.. అన్నీ తానై మారుతి తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు మారుతినే కథ అందించాడు. స్కీన్ ప్లే తనే రాశాడు. మాటలు కూడా ఇచ్చాడు. వీటితో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అతడిదే. సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. సరిగ్గా ఇక్కడే మారుతికి కోపం తన్నుకొచ్చింది

ప్రేమకథా చిత్రమ్ సినిమాను తెరకెక్కించిన ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలే దానికి సీక్వెల్ గా పార్ట్-2 కూడా నిర్మించారు. కాకపోతే తనకు చెప్పకుండా ఈ సినిమాను తీస్తున్నారనేది దర్శకుడు మారుతి వాదన. ప్రేమకథాచిత్రమ్ కాన్సెప్ట్ తనదైనప్పుడు.. తనను పట్టించుకోకుండా దానికి సీక్వెల్ తీయడమేంటనేది మారుతి వాదన. దీనికి సంబంధించి అతడు త్వరలోనే పరిశ్రమలో పంచాయితీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు.

అయితే ఇక్కడ మేటర్ ఏంటంటే.. ఓ సినిమా అనేది పూర్తిగా నిర్మాత సొంతం. అందులో పనిచేసిన వ్యక్తులు (దర్శకుడు, రచయితతో సహా) ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. కాబట్టి కావాలనుకుంటే నిర్మాత పార్ట్-2 తీసుకోవచ్చు. అది అతడి ఇష్టం. దీనికి మారుతి ఎందుకు అంత రాద్దాంతం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.

ప్రేమకథాచిత్రమ్ సినిమా షూటింగ్ దాదాపు 90శాతం పూర్తయింది. ఓ పాట, క్లైమాక్స్ తీస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. వీలైతే వచ్చేనెలలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ సినిమాను అడ్డుకునేందుకు మారుతి స్కెచ్ వేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News