వైఎస్సార్సీపీ ఈ విషయంలో అలర్ట్ కాకుంటే అంతే!

కొన్ని నియోజకవర్గాల్లో అయితే యాభై వేలకు పైగా ఓట్లను ఎత్తేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఐదారు వేల ఓట్లను ఎత్తేశారు. గత కొన్నాళ్లుగా ఏపీలో ఓట్ల తొలగింపు ఒక ఉద్యమంలా సాగింది. ఈసీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓట్ల తొలగింపు వ్యవహారాలు కొత్త ఏమీ కాదు. అధికారంలో ఉన్న వాళ్లు తమ బలం అడుగంటింది అనుకున్నప్పుడు ఈ ఓట్ల తొలగింపుకు దిగుతూ ఉంటారు. […]

Advertisement
Update:2018-10-18 00:00 IST

కొన్ని నియోజకవర్గాల్లో అయితే యాభై వేలకు పైగా ఓట్లను ఎత్తేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఐదారు వేల ఓట్లను ఎత్తేశారు. గత కొన్నాళ్లుగా ఏపీలో ఓట్ల తొలగింపు ఒక ఉద్యమంలా సాగింది. ఈసీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఓట్ల తొలగింపు వ్యవహారాలు కొత్త ఏమీ కాదు. అధికారంలో ఉన్న వాళ్లు తమ బలం అడుగంటింది అనుకున్నప్పుడు ఈ ఓట్ల తొలగింపుకు దిగుతూ ఉంటారు.

గతంలో జగన్ సొంత పార్టీ పెట్టుకుని 18 ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు తీసుకొచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఇదే పని చేసింది. ఓట్ల తొలగింపుకు దిగింది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే చేస్తున్నట్టుగా ఉంది. ఈ విషయంలో వైసీపీ ఆందోళన అయితే వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కమిషన్ అధికారులను కలిసింది. ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని తొలగించారని ఈసీకి కంప్లైంట్ ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ఫిర్యాదులతో ఒరిగేది ఏమీ లేకపోవచ్చు.

ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవల్లో వర్క్ చేసుకోవాలి. ఓటర్ లిస్టులను సరి చూసుకోవాలి. ఎవరి పేర్లు ఉన్నాయి.. ఎవరి పేర్లను తొలగించారనే అంశం గురించి అధ్యయనం చేసుకోవాలి. అప్పుడే ఈ అంశం మీద స్పష్టత వస్తుంది.

ప్రధానంగా క్షేత్ర స్థాయిలో వైసీపీ కార్యకర్తలు ఈ అంశం మీద పని చేసినప్పుడే ఈ సమస్యను వైసీపీ నివారించుకోగలదు. అలాకాకుండా ఉత్తుత్తి ఫిర్యాదులతో ఒరిగేది ఏమీ ఉండదు. బూత్ లేవల్‌లో ఓటర్ లిస్టులను సరి చూసుకున్నప్పుడే వైసీపీ అలర్ట్ అయినట్టు లేకపోతే.. అంతే సంగతులు!

Tags:    
Advertisement

Similar News