హోరాహోరీగా హైదరాబాద్ టెస్ట్
విండీస్ 311 పరుగులకు ఆలౌట్ టీమిండియా 4 వికెట్లకు 308 పరుగులు హైదరాబాద్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన విండీస్…311 పరుగులకు ఆలౌటయ్యింది. మిడిలార్డర్ ఆటగాడు రోస్టన్ చేజ్…. 106 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 6, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. గతవారం రాజ్ […]
- విండీస్ 311 పరుగులకు ఆలౌట్
- టీమిండియా 4 వికెట్లకు 308 పరుగులు
హైదరాబాద్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన విండీస్…311 పరుగులకు ఆలౌటయ్యింది.
మిడిలార్డర్ ఆటగాడు రోస్టన్ చేజ్…. 106 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 6, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
గతవారం రాజ్ కోట్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 48 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలిన విండీస్… హైదరాబాద్ టెస్టులో మాత్రం…101.4 ఓవర్లలో 311 పరుగులు సాధించడం ద్వారా పరువు దక్కించుకోగలిగింది.
చేజ్ ఫైటింగ్ సెంచరీ….
హైదరాబాద్ టెస్ట్ రెండోరోజు ఆటలో విండీస్ మిడిలార్డర్ ఆటగాడు రోస్టన్ చేజ్…. ఫైటింగ్ సెంచరీ సాధించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికే 98 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచిన చేజ్…. మొత్తం 189 బాల్స్ లో 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 106 పరుగులు సాధించాడు.
భారత్ ప్రత్యర్థిగా చేజ్ కు ఇది రెండో శతకం కావడం విశేషం. 26 ఏళ్ల చేజ్ కు ప్రస్తుత హైదరాబాద్ టెస్ట్ వరకూ ఆడిన 24 మ్యాచ్ ల్లో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు ఉంది. చేజ్ ఫైటింగ్ సెంచరీ కారణంగానే విండీస్ తొలిఇన్నింగ్స్ లో 311 పరుగులు చేయగలిగింది.
ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు…
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్…. హైదరాబాద్ టెస్ట్ లో సత్తా చాటుకొన్నాడు. రాజీవ్ స్టేడియం వేదికగా విండీస్ తో జరుగుతున్న ఆఖరిటెస్ట్ తొలిరోజు ఆటలో 3 వికెట్లు పడగొట్టిన ఉమేశ్…. రెండోరోజు ఆటలో సైతం…. మరో మూడు వికెట్లు సాధించాడు. 88 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
రాజీవ్ స్టేడియం వేదికగా ఆరు వికెట్లు పడగొట్టిన భారత తొలి ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. 2011లో విండీస్ ప్రత్యర్థిగా టెస్ట్ అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్… షియా హోప్, రోస్టన్ చేజ్, షేన్ డావ్ రిచ్, బిషూ, హోల్డర్, షేనన్ గేబ్రియల్ వికెట్లు పడగొట్టాడు.
తన కెరియర్ లో 40వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఉమేశ్ ఓ ఇన్నింగ్స్ లో ఐదుకు పైగా వికెట్లు సాధించడం.. కేవలం ఇది రెండోసారి మాత్రమే.
రాహుల్ షరా మామూలే…
టీమిండియా టెస్ట్ యువ ఓపెనర్ కెెఎల్ రాహుల్ వరుస వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. రాజ్ కోటలో ముగిసిన తొలిటెస్ట్ లో మాత్రమే కాదు… హైదరాబాద్ టెస్టులో సైతం రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు.
బ్యాటింగ్ కు అనువుగా ఉన్న రాజీవ్ స్టేడియం పిచ్ పైన రాహుల్ కేవలం నాలుగు పరుగుల స్కోరుకే అవుటయ్యాడు.
పృథ్వీ షాతో కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్… మొత్తం 25 బంతులు ఎదుర్కొని… విండీస్ కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ జేసన్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు.
గత 17 టెస్ట్ ఇన్నింగ్స్ లో రాహుల్ విఫలం కావడం ఇది 15వసారి కావడం విశేషం. రాహుల్ లో అపారప్రతిభ ఉందని… విఫలమవుతున్నా… అతనికి పదేపదే అవకాశాలు ఇస్తూనే ఉంటామని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించడాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
26 ఏళ్ల రాహుల్ కు…. ఇప్పటి వరకూ ఆడిన 31 టెస్టుల్లో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో సహా 1815 పరుగులు సాధించిన రికార్డు ఉంది.