ఐటీ దాడులు.... టీడీపీకి కొంత హ్యాపీ, కొంత బీపీ!
ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న అజెండాకు, ఈ ఐటీ దాడులకు భలే సాపత్యం కుదురుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా మోడీని విమర్శిస్తూ సాగుతోంది. మోడీ తమను మోసం చేశాడని…. కాబట్టి ఇంకోసారి ఓటేయాలని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మాటలు మార్చడం, సమయానుకూలంగా స్నేహితులను మార్చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు లేడు. గతంలో అనేక పర్యాయాలు బీజేపీ మంచిదని ఒకసారి, కాదు చెడ్డదని ఇంకోసారి బాబు ఎన్నికలకు వెళ్లాడు. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినప్పుడు […]
ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న అజెండాకు, ఈ ఐటీ దాడులకు భలే సాపత్యం కుదురుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా మోడీని విమర్శిస్తూ సాగుతోంది. మోడీ తమను మోసం చేశాడని…. కాబట్టి ఇంకోసారి ఓటేయాలని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మాటలు మార్చడం, సమయానుకూలంగా స్నేహితులను మార్చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు లేడు.
గతంలో అనేక పర్యాయాలు బీజేపీ మంచిదని ఒకసారి, కాదు చెడ్డదని ఇంకోసారి బాబు ఎన్నికలకు వెళ్లాడు. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీని తెగ తిట్టాడు. ఇక జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. అవన్నీ మరచి గత ఎన్నికల ముందు బీజేపీతో కలిసి వెళ్లాడు.
ఇక నాలుగేళ్ల నుంచి బీజేపీతో కాపురం చేశాడు. మోడీ సూపర్ అని పొగిడాడు. ఇప్పుడు మాత్రం.. మోడీ మోసం చేశాడని అంటున్నాడు.
తన ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు ఇలా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మోడీని బూచిగా చూపి ఇంకోసారి బయటపడాలని బాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
ఇలాంటి నేపథ్యంలో ఐటీ దాడులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తెలుగుదేశం అధినేత. మోడీ కక్ష గట్టాడు అని…. తమను వేధించడానికే ఈ ఐటీ దాడులు అని బాబు అంటున్నాడు. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు.. తెలుగుదేశం నేతలందరిదీ ఇదే మాట. సీఎం రమేశ్ అయితే ఇంకో అడుగు ముందుకు వేసి.. తన ఇంటిపై జరిగిన ఐటీదాడులు రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇదీ వీళ్ల తీరు.
ఈ విధంగా ఐటీ దాడులను తమకు అనుకూలంగా, సానుభూతికి అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో వీళ్లను ఈ దాడులు భయపెడుతూ ఉన్నాయి కూడా. ఈ దాడుల్లో ఏ గుట్టు బయటపడుతుందో…. ఎవరు విచారణకు హాజరు కావాల్సి వస్తుందో…. ఏ లొసుగు బయటపడుతుందో అనే ఆందోళన తెలుగుదేశం వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు.