బాబుగారి మంత్రులను భయపెడుతున్న ఎన్నికలు!
ఒకరు కాదు ఇద్దరు కాదు.. చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులు చాలా మంది వచ్చే ఎన్నికల విషయంలో భయాందోళనలకు గురి అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలుకుతున్నాడు. తన పాలనపై ప్రజలు పరవశించి పోతున్నారని, 90 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అయితే ఆయన మంత్రులు మాత్రం ప్రత్యక్ష పోటీ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలే వస్తే బాబు మంత్రులకు చుక్కలే అని…. ఇంకా ఎన్నికలకు […]
ఒకరు కాదు ఇద్దరు కాదు.. చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులు చాలా మంది వచ్చే ఎన్నికల విషయంలో భయాందోళనలకు గురి అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలుకుతున్నాడు. తన పాలనపై ప్రజలు పరవశించి పోతున్నారని, 90 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అయితే ఆయన మంత్రులు మాత్రం ప్రత్యక్ష పోటీ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలే వస్తే బాబు మంత్రులకు చుక్కలే అని…. ఇంకా ఎన్నికలకు ఐదారు నెలలు ఉంది కాబట్టి.. వీళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారని సమాచారం. వీరిలో ఒకరిద్దరు పక్క చూపులు కూడా చూస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఈ జాబితాలో మొదటగా వినిపిస్తోంది. గంటా జనసేనలోకి చేరిపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి.
ఇలా ఒక మంత్రి చేతులు ఎత్తేస్తున్నాడు. ఇక మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా వచ్చేసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేడట. ఈయన వీలైతే శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తానని అంటున్నాడట. ప్రస్తుతం అక్కడ నుంచి అచ్చెన్న అన్న కొడుకు ఎంపీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈయనకు ఏ మేరకు ఛాన్స్ దక్కుతుందో చూడాల్సి ఉంది.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా వచ్చేసారి అదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా లేడని తెలుస్తోంది. ఆయన కూడా ఏదైనా ఎంపీ సీటు దొరికితే వెళ్లిపోతానని అంటున్నాడట.
ఇంకో మంత్రి ఆదినారాయణ రెడ్డి వచ్చేసారి జమ్మలమడుగు నుంచి కాక మరో సీటు మీద ఆశలు పెట్టుకున్నాడు. అమర్ నాథ్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని అమర్ భయపడుతున్నాడు.
ఇక సోమిరెడ్డి, నారాయణలు ప్రత్యక్ష పోటీకి నియోజకవర్గాలను వెదుక్కొనే పనిలో ఉన్నారు. అఖిలప్రియకు చంద్రబాబు అవకాశం ఇస్తాడా అనేది కొశ్చన్ మార్క్ గానే ఉంది.
ఓవరాల్ గా బాబు కేబినెట్ మంత్రులను ఎన్నికలు భయపెడుతూ ఉన్నాయని స్పష్టం అవుతోంది.