కారు పార్టీ.... కార్ల తోనే బుజ్జగిస్తోందట

హైదరాబాద్ లోనే ఉంటాడు. సొంత నియోజకవర్గం సిరిసిల్లకు రాడు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్నారట. అందుకే ఇటీవల కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే ఎవరూ రాలేదట. ఈ అసంతృప్త జ్వాల తన మెజార్టీని ప్రభావితం చేస్తుందని భావించిన కేటీఆర్ తాజాగా అలెర్ట్ అయ్యాడు. వెంటనే తన నియోజకవర్గ నేతలతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి వారి కోరికలన్నీ తీర్చి తాయిలాలు ప్రకటించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. […]

Advertisement
Update:2018-10-06 11:51 IST

హైదరాబాద్ లోనే ఉంటాడు. సొంత నియోజకవర్గం సిరిసిల్లకు రాడు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్నారట. అందుకే ఇటీవల కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే ఎవరూ రాలేదట. ఈ అసంతృప్త జ్వాల తన మెజార్టీని ప్రభావితం చేస్తుందని భావించిన కేటీఆర్ తాజాగా అలెర్ట్ అయ్యాడు. వెంటనే తన నియోజకవర్గ నేతలతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి వారి కోరికలన్నీ తీర్చి తాయిలాలు ప్రకటించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే దీనికోసం హరీష్ రావును వాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేటీఆర్, హరీష్ మధ్య వైరం ఉందని చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ సూచన మేరకు బావ బావమరుదులు హరీష్-కేటీఆర్ లు కలిసి పోయారు. సిరిసిల్ల నియోజకవర్గ నేతలను హైదరాబాద్ రప్పించి వారిని ‘సంతృప్తి’ పరిచారట. ఇందులో హరీష్ రావుకు చెందిన నమ్మకస్తులైన కార్యకర్తలు కూడా ఉన్నారట. సిరిసిల్లకు పక్కనే సిద్దిపేట ఉంటుంది. ఇల్లంతకుంట…. ముస్తాబాద్ మండలాల్లో హరీష్ రావుకు బలం ఎక్కువ. కానీ ఇవి సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోనివి. అందుకే హరీష్ ను రప్పించి మరీ తన నియోజకవర్గంలోని అసమ్మతికి కేటీఆర్ తెరదించారని సమాచారం.

తాజాగా శనివారం సిరిసిల్ల నియోజకవర్గ నేతలకు ఆ తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. మండల స్థాయి జడ్పీటీసీలు, ఎంపీపీలకు కార్లు బహుమతులుగా వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఇక పక్కనున్న వేములవాడలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని కూడా కేటీఆర్ తరహాలోనే మండల నేతలకు ఈ కార్ల బహుమానం ఇచ్చి సంతృప్తిపరిచాడనే ప్రచారం జరుగుతోంది.

ఏదీ ఏమైనా ఎన్నికల వేళ…. నాయకుల అవసరం ఎమ్మెల్యే అభ్యర్థులకు తప్పనిసరి. అందుకే ఇన్నాళ్లు వారికి ఏమీ చేయలేకపోయినా…. ఇప్పుడు ఎదురొచ్చి మరీ నాయకులు వారి కోరికలు తీరుస్తున్నారట. ఇక్కడే కాదు…. తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ మండలస్థాయి నేతలకు ఈ భారీ తాయిలాల ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోని కింది స్థాయి నేతల పంట పండిస్తోంది.

Tags:    
Advertisement

Similar News