రాజ్ కోట్ టెస్టులో విరాట్ కొహ్లీ సూపర్ షో
కెరియర్ లో విరాట్ కొహ్లీ 24వ సెంచరీ కెప్టెన్ గా కొహ్లీ 17వ శతకం సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో …టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ….తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. విదేశీ, స్వదేశీ సిరీస్ లు అన్నతేడా లేకుండా పరుగుల హోరు, సెంచరీల జోరు కొనసాగిస్తున్నాడు. రాజ్ కోట టెస్ట్ రెండోరోజు ఆటలో.. 134 పరుగుల స్కోరు సాధించడం ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. రన్ […]
- కెరియర్ లో విరాట్ కొహ్లీ 24వ సెంచరీ
- కెప్టెన్ గా కొహ్లీ 17వ శతకం
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో …టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ….తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. విదేశీ, స్వదేశీ సిరీస్ లు అన్నతేడా లేకుండా పరుగుల హోరు, సెంచరీల జోరు కొనసాగిస్తున్నాడు. రాజ్ కోట టెస్ట్ రెండోరోజు ఆటలో.. 134 పరుగుల స్కోరు సాధించడం ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.
రన్ మెషీన్ విరాట్ కొహ్లీ….
విరాట్ కొహ్లీ….కేవలం క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. సచిన్ అంతటి మొనగాడు. సచిన్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఒకే ఒక్కడు.
టీమిండియా కెప్టెన్ గా మాత్రమే కాదు…ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ సిరీస్ లో… టాప్ స్కోరర్ గా నిలిచిన కొహ్లీ….వెస్టిండీస్ తో ప్రారంభమైన సిరీస్ తొలిటెస్ట్ రెండోరోజు ఆటలోనే మరో మాస్టర్ క్లాస్ సెంచరీ సాధించాడు.
184 బాల్స్ లో 139 పరుగులు
తన బ్యాటింగ్ శైలికి అనువుగా ఉన్న సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వికెట్ పైన… కరీబియన్ బౌలింగ్ ఎటాక్ ను అలవోకగా ఎదుర్కొంటూ… కొహ్లీ ఎనలేని ఓర్పుతో శతకం పూర్తి చేశాడు.
184 బాల్స్ లో కేవలం ఏడు బౌండ్రీలతోనే సెంచరీ పూర్తి చేసిన కొహ్లీ…చివరకు 139 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు.
విరాట్ కొహ్లీ కెరియర్ లో ఇది 24వ శతకం కాగా….కెప్టెన్ గా 17వ సెంచరీ. స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా కంటే కెప్టెన్ గానే కొహ్లీ ఎక్కువ శతకాలు సాధించడం విశేషం.
3వేల పరుగుల విరాట్….
ఈ క్రమంలో…స్వదేశీ సిరీస్ ల్లో 3 వేల పరుగులు సాధించిన 11వ భారత క్రికెటర్ గా కొహ్లీ రికార్డుల్లో చేరాడు.
కెప్టెన్ గా కొహ్లీ సాధించిన మొత్తం 17 సెంచరీలలో…11 శతకాలు భారత గడ్డపైనే సాధించడం విశేషం.
సచిన్ రికార్డు తెరమరుగు
అంతేకాదు… టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 24 సెంచరీలు బాదిన భారత క్రికెటర్ గా కొహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు.
డాన్ బ్రాడ్మన్ టాప్….
మాస్టర్ సచిన్ టెండుల్కర్ 125 ఇన్నింగ్స్ లో 24 సెంచరీలు సాధిస్తే…విరాట్ కొహ్లీ మాత్రం 123 ఇన్నింగ్స్ లోనే 24 శతకాలు నమోదు చేయటం విశేషం.
క్రికెట్ చరిత్రలోనే అతితక్కువ ఇన్నింగ్స్ లో 24 శతకాలు సాధించిన రికార్డు ఆల్ టైమ్ గ్రేట్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ పేరుతో ఉంది. బ్రాడ్మన్ కేవలం 66 ఇన్నింగ్స్ లోనే 24 టెస్ట్ శతకాలు సాధించడం ఓ అసాధారణ రికార్డుగా మిగిలిపోయింది.
కొహ్లీ సాధించిన మొత్తం 24 శతకాలలో… వెస్టిండీస్ పైన సాధించిన సెంచరీలు రెండు…కెప్టెన్ హోదాలోనే సాధించడం విశేషం.
24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు
ప్రస్తుత రాజ్ కోట్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ వరకూ…ఆడిన 72 టెస్టులు, 123 ఇన్నింగ్స్ లో …కొహ్లీ 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు సాధించాడు.
మొత్తం 6 వేల 281 పరుగులతో 53కు పైగా సగటు నమోదు చేసిన కొహ్లీ…ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగాడు.