రోహింగ్యాల తరలింపు.... సుప్రీం కీలక తీర్పు
ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తిరిగి వారి దేశం మయన్మార్‌కు పంపడానికి సుప్రీం కోర్టు ఈరోజు (గురువారం) ఆదేశాలిచ్చింది. వీరి తరలింపు పై వేసిన పిటీషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రోహింగ్యాలను ప్రభుత్వం తరలించవచ్చని స్పష్టం చేసింది. ఏడుగురు రోహింగ్యాలు 2012 నుంచి అసోంలో అక్రమంగా ఉంటున్నారు. కొన్నాళ్లపాటు జైలు శిక్ష కూడా అనుభవించారు వీరి వద్ద ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో మయన్మార్ తిరిగి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం […]
ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తిరిగి వారి దేశం మయన్మార్‌కు పంపడానికి సుప్రీం కోర్టు ఈరోజు (గురువారం) ఆదేశాలిచ్చింది. వీరి తరలింపు పై వేసిన పిటీషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రోహింగ్యాలను ప్రభుత్వం తరలించవచ్చని స్పష్టం చేసింది.
ఏడుగురు రోహింగ్యాలు 2012 నుంచి అసోంలో అక్రమంగా ఉంటున్నారు. కొన్నాళ్లపాటు జైలు శిక్ష కూడా అనుభవించారు వీరి వద్ద ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో మయన్మార్ తిరిగి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో నిన్న పిటీషన్ దాఖలైంది. ఈ ఏడుగురు అక్రమ వలసదారులని.. వీరిని జైల్లో పెట్టాలని పిటీషన్ లో కోరారు.
కానీ మయన్మార్ ప్రభుత్వం ఏడుగురిని తమ పౌరులుగా గుర్తించిందని…. వారిని మయన్మార్ కు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం కోరింది. దీంతో వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు ఆ ఏడుగురు రోహింగ్యాలను మయన్మార్ తరలించవచ్చని గురువారం మధ్యాహ్నం తీర్పునిచ్చింది.
మయన్మార్ లో అల్లకల్లోలంతో దేశంలో రోహింగ్యాలు స్థిరపడడానికి కాంగ్రెస్ హయాంలో నాటి కేంద్రమంత్రులు అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్ , మమతా బెనర్జీలు అనుమతిచ్చారు. రోహింగ్యాలను తరువాత కొన్ని ఉగ్రవాద సంస్థలు రిక్రూట్ చేసుకొని తీవ్రవాద చర్యలు పాల్పడుతున్నాయి. దీంతో వీరిని పంపించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రస్తుతం మన దేశంలో సుమారు 50 వేలమంది అధికారికంగానూ, 5 లక్షలమంది అనధికారికంగానూ రోహింగ్యాలు నివసిస్తున్నారు. 2013 లో బుధ్దగయలో పేలుళ్ళకు పాల్పడింది ఈ రోహింగ్యాలేనని పోలీసులు గుర్తించారు. బౌద్దులను టార్గెట్ చేసే వీరిని దేశంలో ఉండనీయవద్దని ఈశాన్య భారతంలో జనాలు కోరుతున్నారు.