మాయావతికి డిప్యూటీ పీఎం ఆఫర్ !
2019 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ వ్యూహాన్ని రచించింది. యుపిలో 80 స్థానాలు కొల్లగొట్టాలంటే వచ్చే ఎన్నికల్లో కష్టమే. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కలిస్తే బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఈజీ కాదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఇదే సంగతిని స్పష్టం చేశాయి. దీంతో కమలనాథులు తమ ప్లాన్‌లకు పదునుపెట్టారు. యుపిలో మహాకూటమి ఏర్పడకుండా ఏం చేయాలో ఆలోచించారు. ఇప్పుడు ఆ ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెట్టారు. […]
2019 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ వ్యూహాన్ని రచించింది. యుపిలో 80 స్థానాలు కొల్లగొట్టాలంటే వచ్చే ఎన్నికల్లో కష్టమే. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కలిస్తే బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఈజీ కాదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఇదే సంగతిని స్పష్టం చేశాయి. దీంతో కమలనాథులు తమ ప్లాన్‌లకు పదునుపెట్టారు. యుపిలో మహాకూటమి ఏర్పడకుండా ఏం చేయాలో ఆలోచించారు. ఇప్పుడు ఆ ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెట్టారు.
యూపీలో ఎక్కువ సీట్లు గెలిస్తేనే మోడీ గద్దెనెక్కుతారు. అందుకే అక్కడ మాయావతిని దువ్వుతున్నారు. ఎస్పీతో మాయవతి పొత్తు చెడగొట్టేందుకు మాయావతికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే డిప్యూటీ పీఎం పదవి ఇస్తామని చెప్పారట. ఈ ఆఫర్ కాదంటే… ఎలాగూ ఈడీ, సీబీఐ, ఐటీలు ఉండనే ఉన్నాయి. ఆస్తుల కేసు మళ్లీ బయటకు తీస్తామని బెదిరించారట. దీంతో మాయావతి బీజేపీ ఆఫర్‌కు ఒకే చెప్పిందని తెలుస్తోంది.
బీఎస్పీకి పలు రాష్ట్రాల్లో దళిత ఓట్ బ్యాంక్ ఉంది. అది బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. యూపీలో అఖిలేష్, మాయావతి, కాంగ్రెస్ కలిస్తే… గతంలో వచ్చినన్ని సీట్లు రావు. పైగా బీఎస్పీకి దళిత ఓట్ బ్యాంక్ ఉంది. దీంతో బీఎస్పీతో రహస్య ఒప్పందానికి తెరలేపింది అమిత్ షా బ్యాచ్. బీజేపీతో వచ్చిన అవగాహనలో భాగంగానే మాయావతి మధ్యప్రదేశ్‌లో మహాకూటమిలో చేరేదిలేదని ప్రకటన చేశారు.
ఇందుకు దిగ్విజయ్ సింగ్ అనే బూచిని చూపారనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒక్క మధ్య ప్రదేశే కాదు… రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని మాయావతి నిర్ణయించారు. ఈ రాష్ట్రాల్లో బీఎస్సీకి 4 నుంచి 10 శాతం ఓటు బ్యాంక్ ఉంది.
మరోవైపు మాయావతి చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు నై అంది. అక్కడ అజిత్ జోగి పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. అక్కడ త్రిముఖ పోరు జరగనుంది. దీంతో బీజేపీ గట్టెక్కుతుందని విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కి షాకిచ్చారు. ఇలా కాంగ్రెస్‌తో కలవడం లేదు మాయవతి.
ఇప్పటికిప్పుడు మోదీతో జత కలిస్తే తన ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది. యూపీలో భీమ్ ఆర్మీ పేరుతో చంద్రశేఖర్ బీఎస్పీ ఓట్లకు గురి పెట్టాడు. అటు గుజరాత్ లో జిగ్నేశ్ మేవానీ రోజురోజుకు బలపడుతున్నాడు. దీంతో బీజేపీకి దూరంగా ఉన్నట్లుగానే 2019 ఎన్నికలకు వెళ్లి…. తర్వాత కలవడం అసలు వ్యూహం. ఇప్పటికే బీఎస్పీని దగ్గర చేసుకునేందుకు కాన్షీరాంకు భారతరత్న ఇస్తామన్న హామీ కూడా లభించింది. 2019 ఎన్నికల్లో గట్టెక్కెందుకు బీజేపీ ఇలా వ్యూహాలను రచిస్తూ వెళుతోంది.