బతుకమ్మ చీరలకు బ్రేక్.... మరి రైతుబంధు పరిస్థితి ఏంటో ?
బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ చీరల పంపిణీ చేయాలని అనుకుంది. గత ఏడాది జరిగిన నిరసనల దృష్టితో… ఈసారి చీరల రంగు మార్చారు. క్వాలిటీ పెంచారు. ఇప్పటికే పలు మార్లు సిరిసిల్ల వెళ్లి అధికారులు చీరల నాణ్యతను పరిశీలించి వచ్చారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈనెల 12 నుంచి చీరల పంపిణీ జరగాల్సి ఉంది. ఈ […]
బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ చీరల పంపిణీ చేయాలని అనుకుంది. గత ఏడాది జరిగిన నిరసనల దృష్టితో… ఈసారి చీరల రంగు మార్చారు. క్వాలిటీ పెంచారు. ఇప్పటికే పలు మార్లు సిరిసిల్ల వెళ్లి అధికారులు చీరల నాణ్యతను పరిశీలించి వచ్చారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా ఈనెల 12 నుంచి చీరల పంపిణీ జరగాల్సి ఉంది. ఈ లోపు ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టరాదని ఆదేశాలు ఇవ్వాలని కొందరు కోరారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున చీరల పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది మొత్తం 95లక్షల చీరలను పంపిణీ చేయాలని అనుకుంది. 49.18 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. రూ.280 కోట్ల వ్యయంతో 80 రంగుల్లో జరీ అంచు పాలిస్టర్ చీరలను తయారు చేయించారు. అయితే ఇప్పుడు ఈసీ బ్రేకులు వేయడంతో ఈ చీరలు గోదాముల్లో నిల్వ ఉంచబోతున్నారు.
మరోవైపు బతుకమ్మ చీరల పంపిణీ ఆపివేసిన ఈసీ…. రైతు బంధు చెక్కు పంపిణీలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. తొలి విడతలో భాగంగా మే నుంచి మొదలు పెట్టి జూన్‌లో పెట్టుబడి సాయం అందించారు.
అయితే అక్టోబర్‌లో రెండో విడత సాయం అందిస్తామని ప్రభుత్వం ఇంతకుముందు తెలిపింది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రైతు బంధు చెక్కుల పంపిణీ జరుగుతుందా? లేదా? అనేది ఓ ప్రశ్నగా మారింది. బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసిన ఈసీ… రైతు బంధు చెక్కుల పంపిణీ కూడా ఆపివేస్తుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఈ చీరల పంపిణీ నిలిపివేయడాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రభుత్వం తిరిగి ఎన్నికైన తర్వాత మళ్లీ చీరలు పంపిణీ చేస్తామని కొందరు నేతలు ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. మొత్తానికి ఈ రెండు పథకాల నిలిపివేయడం టీఆర్ఎస్ ఓట్లకు ఎంతమేరకు గండి కొడుతుందో చూడాలి.