మోడీ, రాహుల్.... ఇద్దరూ తెలంగాణలో పోటీ చేస్తారా!

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్లు తరచూ చెబుతూ ఉంటారు. రాహుల్ లేదా సోనియా లేదా ప్రియాంకను తెలంగాణలో పోటీ చేయిస్తామని. గత ఎన్నికల సమయంలో కూడా ఈ మాట చెప్పారు. రాహుల్ గాంధీని తెలంగాణలో పోటీ చేయిస్తామని, మెదక్ నుంచి ఆయనను గెలిపించుకుంటామని కాంగ్రెస్ వాళ్లు హడావుడి చేశారు. వెనకటికి చరిత్రలో ఎప్పుడో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ సెంటిమెంటును ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటూ ఉంటారు. […]

Advertisement
Update:2018-10-03 00:32 IST

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్లు తరచూ చెబుతూ ఉంటారు. రాహుల్ లేదా సోనియా లేదా ప్రియాంకను తెలంగాణలో పోటీ చేయిస్తామని. గత ఎన్నికల సమయంలో కూడా ఈ మాట చెప్పారు. రాహుల్ గాంధీని తెలంగాణలో పోటీ చేయిస్తామని, మెదక్ నుంచి ఆయనను గెలిపించుకుంటామని కాంగ్రెస్ వాళ్లు హడావుడి చేశారు.

వెనకటికి చరిత్రలో ఎప్పుడో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ సెంటిమెంటును ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటూ ఉంటారు.

అయితే ఇందిరకు ఉన్న ఛరిష్మాలో రాహుల్ కు ఉన్నది ఎంత? అనేది అందరికీ తెలిసిందే. ఆ సంగతలా ఉంటే…. ఇప్పుడు బీజేపీ వాళ్లు లేచారు. వీళ్లు మోడీని తెలంగాణలో పోటీ చేయిస్తాం అంటున్నారు.

ప్రధానమంత్రి మోడీని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా నామినేషన్ వేయిస్తామని…. అందుకు సికింద్రాబాద్ నియోజకవర్గమే వేదిక అని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈయన మొన్నటి వరకూ కేంద్రమంత్రిగా కూడా ఉండేవాడు. అయితే ఎందుకో మోడీ తప్పించాడు. ఇక వచ్చే ఎన్నికల్లో వయసు రీత్యా దత్తన్న ఎంపీగా పోటీ చేయకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి.

ఈ నేపథ్యంలో తన సీటు నుంచి మోడీ పోటీ చేయాలని దత్తాత్రేయ కోరుతున్నాడట. ఈ మేరకు అధిష్టానానికి ప్రతిపాదన కూడా పంపించాడట.

అమిత్ షాకే ఈ విషయం గురించి విన్నవించాడట. మోడీ గనుక తెలంగాణకు వచ్చి పోటీ చేస్తే ఇక్కడ పార్టీకి ఊపురావడంతో పాటు…. మొత్తంగా సౌతిండియాలోనే బీజేపీకి ఊపు వస్తుందని దత్తన్న అంటున్నాడట. ప్లాన్ బాగానే ఉంది కానీ, మోడీ ఇక్కడకు వచ్చి పోటీ చేస్తాడా?

Tags:    
Advertisement

Similar News