గోవిందప్ప వెంకటస్వామి కి గూగుల్ ఘన నివాళి
ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి గుగుల్ ఘన నివాళి అర్పించింది. ఆయన శత జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. 1918 అక్టోబర్ 1న తమిళనాడులో వడమాలపురంలో జన్మించిన వెంకటస్వామి తన జీవితాన్నంతా ప్రజల కంటి సమస్యలు పరిష్కరించేందుకే కేటాయించారు. స్నేహితులు, రోగులు ఆయనను ”వి” అని పిలిచేవారు. అతి తక్కువ మందితో ప్రారంభమైన అరవింద్ ఐ హాస్పిటల్ అంచలంచెలుగా ఎదిగింది. కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి […]
ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి గుగుల్ ఘన నివాళి అర్పించింది. ఆయన శత జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసింది.
1918 అక్టోబర్ 1న తమిళనాడులో వడమాలపురంలో జన్మించిన వెంకటస్వామి తన జీవితాన్నంతా ప్రజల కంటి సమస్యలు పరిష్కరించేందుకే కేటాయించారు. స్నేహితులు, రోగులు ఆయనను ”వి” అని పిలిచేవారు. అతి తక్కువ మందితో ప్రారంభమైన అరవింద్ ఐ హాస్పిటల్ అంచలంచెలుగా ఎదిగింది. కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
వెంకటస్వామికి 30 ఏళ్ల వయసులోనే రిమటాయిడ్ ఆర్థరైటిస్ రావడంతో…. అనేక ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని అధిగమించి కాటరాక్ట్ ఆపరేషన్ చేయడంలో నైపుణ్యాన్ని సంపాదించారు. రోజుకు 100 కాటరాక్ట్ ఆపరేషన్లు చేసే స్థాయికి చేరుకున్నారు. తన జీవితకాలంలో మొత్తం లక్ష వరకూ కాటరాక్ట్ ఆపరేషన్లు చేసిన ఘనత ఆయన సొంతం.
ఒక పక్క సర్జరీలు చేస్తూ వేలాది మందికి కంటిచూపును ప్రసాదిస్తూనే… మరోవైపు సమాజసేవ కూడా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐ క్యాంపులు నిర్వహించారు. అంధులకు ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ సెంటర్లు ప్రారంభించారు. వెంకటస్వామి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1973లో పద్మశ్రీ అవార్డును అందించింది.
బ్రతికున్నంత కాలం ప్రజలకు సేవచేయడంలోనే తృప్తి పొందిన గోవిందప్ప వెంకటస్వామి 87 ఏళ్ల వయసులో 2006లో మరణించారు.