అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు.... బ్యాంకు లావాదేవీలపై ఈసీ నిఘా
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ గట్టి నిఘా పెట్టింది. అభ్యర్ధుల ఎన్నికల ప్రచారానికి చేస్తున్న ఖర్చును నియంత్రణలోకి ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయింది. ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగింది. భారీ స్థాయిలో జరుగుతున్న బ్యాంక్ లావాదేవీలపై దృష్టి సారించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌ను కలిశారు. అభ్యర్ధులు […]
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ గట్టి నిఘా పెట్టింది. అభ్యర్ధుల ఎన్నికల ప్రచారానికి చేస్తున్న ఖర్చును నియంత్రణలోకి ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయింది. ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగింది. భారీ స్థాయిలో జరుగుతున్న బ్యాంక్ లావాదేవీలపై దృష్టి సారించింది.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌ను కలిశారు. అభ్యర్ధులు బ్యాంక్ లావాదేవీలపై నిఘా వ్యవహారాన్ని ఆయనతో చర్చించారు. వివిధ బ్యాంకులతో కూడా ఈసీ అధికారులు టచ్‌లో ఉన్నారు.
గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఖర్చు వివరాలను అందించని 122 అభ్యర్ధులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వారి నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. ఈ జాబితాపై కూడా ఈసీ మరోసారి దృష్టి సారించింది.
ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ బిజీ బిజీ
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈవీఎంల ఖరీదు, వివిపిఏటి యంత్రాల ఖరీదు చేయడం, వాటిని పరీక్షించడం కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన యంత్రాల్లో 70 శాతం యంత్రాలను పరీక్షించినట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న భద్రత గురించి కూడా ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు 250 కోట్ల రూపాయలు అందించిందని…ఇంకా అవసరం అయితే మరిన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఈవీఎం, వివిపిఏటి యంత్రాల వాడకంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.