కిడారి మరణ వాంగ్మూలమే సాక్ష్యం చంద్రబాబూ....

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కిడారి హత్యలో మావోయిస్టులకు సహకరించింది టీడీపీ నేతలేనని స్పష్టమైందన్నారు. కిడారి హత్య వెనుక టీడీపీ ఎంపీటీసీ, టీడీపీ మండల నాయకుడి హస్తం ఉన్నట్టు టీడీపీ అనుకూల పత్రికే రాసిందని భూమన చెప్పారు. కిడారి హత్య వెనుక వైసీపీ ప్రమేయం ఉందన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్దమని తేలిపోయిందన్నారు. అరకు ఎమ్మెల్యే హత్యకు అక్రమ మైనింగే ప్రధాన కారణమన్నది ముమ్మాటికీ నిజమన్నారు. […]

Advertisement
Update:2018-10-01 10:55 IST

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కిడారి హత్యలో మావోయిస్టులకు సహకరించింది టీడీపీ నేతలేనని స్పష్టమైందన్నారు. కిడారి హత్య వెనుక టీడీపీ ఎంపీటీసీ, టీడీపీ మండల నాయకుడి హస్తం ఉన్నట్టు టీడీపీ అనుకూల పత్రికే రాసిందని భూమన చెప్పారు.

కిడారి హత్య వెనుక వైసీపీ ప్రమేయం ఉందన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్దమని తేలిపోయిందన్నారు. అరకు ఎమ్మెల్యే హత్యకు అక్రమ మైనింగే ప్రధాన కారణమన్నది ముమ్మాటికీ నిజమన్నారు.

గతంలోనూ రాజధానిలో పంట పొలాలు తగలబెట్టడం, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. అందుకే ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదన్నారు.

ఏజెన్సీలో టీడీపీ నేతలే గంజాయి వ్యాపారం చేస్తున్నారన్నారు. ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులంతా తెలంగాణలో చంద్రబాబు ముఠాతో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలన్న దాని కోసం హైదరాబాద్‌లో ఉన్నారని భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. నిఘా వ్యవస్థను చంద్రబాబు ఇలా తప్పుదారి పట్టించడం వల్లే ఎమ్మెల్యే కిడారి హత్యకు మావోయిస్టులకు అవకాశం వచ్చిందన్నారు.

ఎమ్మెల్యే కిడారిని హత్య చేసి మరొకరికి అక్కడ అవకాశం ఇప్పించేందుకు టీడీపీ నేతలే ఈ పని చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబుది ఒక నిరంకుశ చరిత్ర అని మండిపడ్డారు. వంగవీటి రంగాను చంద్రబాబే హత్య చేయించారని హరిరామజోగయ్యే తన పుస్తకంలో రాశారన్నారు. ఐఏఎస్ రాఘవేంద్రను హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు అని భూమన విమర్శించారు.

రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించడంలో చంద్రబాబు ఆరితేరిపోయారన్నారు. ఎమ్మెల్యే కిడారిని చంద్రబాబు డబ్బు పెట్టి కొనుగోలు చేశారన్న దానికి మావోయిస్టుల ముందు కిడారి సర్వేశ్వరరావు ఇచ్చిన వాంగ్మూలమే సాక్ష్యమన్నారు. తాను పార్టీ మారినప్పుడు 12 కోట్లు తీసుకున్నానని మావోయిస్టులతో కిడారి చెప్పారని ఆయన గన్‌మెన్‌ మీడియా సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు.

Tags:    
Advertisement

Similar News