ఇది పచ్చి అబద్ధం.... క్లారిటీ ఇచ్చిన 'అరవింద'

స్టార్ హీరో సినిమా వస్తుందంటే రకరకాల పుకార్లు రావడం కామన్. యూనిట్ కు ఇష్టముంటే వాటిపై వివరణ ఇస్తారు. లేదంటే చూసీ చూడనట్టు ఊరుకుంటారు. అలా కొన్ని విషయాలు పుకార్లకే పరిమితమైపోతాయి. తాజాగా అరవింద సమేత చిత్రానికి సంబంధించి కూడా ఇలాంటిదే ఓ పుకారు వచ్చింది. నిజంగా అది పుకారే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. యూనిట్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే రియాక్ట్ అయ్యారు సినిమా యూనిట్ సభ్యులు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. […]

Advertisement
Update:2018-10-01 05:30 IST

స్టార్ హీరో సినిమా వస్తుందంటే రకరకాల పుకార్లు రావడం కామన్. యూనిట్ కు ఇష్టముంటే వాటిపై వివరణ ఇస్తారు. లేదంటే చూసీ చూడనట్టు ఊరుకుంటారు. అలా కొన్ని విషయాలు పుకార్లకే పరిమితమైపోతాయి.

తాజాగా అరవింద సమేత చిత్రానికి సంబంధించి కూడా ఇలాంటిదే ఓ పుకారు వచ్చింది. నిజంగా అది పుకారే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. యూనిట్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే రియాక్ట్ అయ్యారు సినిమా యూనిట్ సభ్యులు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక పాత్రలో కొడుకు, మరోపాత్రలో తండ్రిగా కనిపించబోతున్నాడట. ఇది రీసెంట్ గా మొదలైన పుకారు. ఈ రూమర్ ఇలా స్టార్ట్ అయిన వెంటనే అలా క్లారిటీ ఇచ్చింది యూనిట్. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయడం లేదని ప్రకటించింది.

ప్రత్యేకించి ఈ పుకారుపై యూనిట్ ఇలా వెంటనే ప్రతిస్పందించడానికి ఓ రీజన్ ఉంది. గతంలో తండ్రికొడుకులుగా ఎన్టీఆర్ చేసిన ఓ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ముడిపెట్టి అరవింద సమేతకు ఎక్కడ నెగెటివ్ సెంటిమెంట్ అంటగడతారేమో అని యూనిట్ భయం. అందుకే వెంటనే స్పందించి పుకారుపై వివరణ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News