దేవదాస్ 3 రోజుల వసూళ్లు
మొదటి రోజు ఏకంగా 4 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన దేవదాస్ కు రెండో రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ, నెగెటివ్ టాక్ రావడం ఈ సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. ఇద్దరు పెద్ద హీరోల్ని పెట్టుకొని కూడా, మరీ నాసిరకంగా సన్నివేశాలు రాసుకున్నారంటూ సోషల్ మీడియాలో యూనిట్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ డిస్కషన్ వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింది. మొదటి రోజు 4 కోట్ల […]
మొదటి రోజు ఏకంగా 4 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన దేవదాస్ కు రెండో రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ, నెగెటివ్ టాక్ రావడం ఈ సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. ఇద్దరు పెద్ద హీరోల్ని పెట్టుకొని కూడా, మరీ నాసిరకంగా సన్నివేశాలు రాసుకున్నారంటూ సోషల్ మీడియాలో యూనిట్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ డిస్కషన్ వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింది.
మొదటి రోజు 4 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా.. 3 రోజులకు 8 కోట్ల 63 లక్షలు మాత్రమే ఆర్జించింది. అంటే.. ఈ రెండు రోజుల్లో సినిమాకు వసూళ్లు బాగా తగ్గాయని అర్థం. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అంతంతమాత్రంగానే నడుస్తోంది. 3 రోజుల్లో హాఫ్ మిలియన్ మార్క్ (5లక్షల 44వేల డాలర్లు) మాత్రమే దాటగలిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 3.28 కోట్లు
సీడెడ్ – రూ. 1.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.16 కోట్లు
ఈస్ట్ – రూ. 0.65 కోట్లు
వెస్ట్ – రూ. – 0.48 కోట్లు
గుంటూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 0.64 కోట్లు
నెల్లూరు – రూ. 0.33 కోట్లు