మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు.... నైట్ మార్చ్
2019 లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే అన్ని విధాలా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. యువతను, మహిళలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహిళా అధికార్ యాత్రల పేరిట పట్టణ ప్రాంతాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోను పర్యటనలు చేపట్టేందుకు కాంగ్రెస్ మహిళా విభాగం ప్రణాళికలు రచిస్తోంది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్…ఈదిశగా అడుగులు వేస్తున్నారు. మహిళలు, యువత ఏ పార్టీకి ఎక్కువగా […]
2019 లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే అన్ని విధాలా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. యువతను, మహిళలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహిళా అధికార్ యాత్రల పేరిట పట్టణ ప్రాంతాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోను పర్యటనలు చేపట్టేందుకు కాంగ్రెస్ మహిళా విభాగం ప్రణాళికలు రచిస్తోంది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్…ఈదిశగా అడుగులు వేస్తున్నారు.
మహిళలు, యువత ఏ పార్టీకి ఎక్కువగా ఓటేస్తే ఆ పార్టీయే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ చేపట్టిన అధ్యయనాలు కూడా ఇదే విషయాలను వెల్లడిస్తున్నాయి. మనదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపుగా పురుష ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉంది. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 1.46 శాతం మాత్రమే ఉందని సుష్మితా దేవ్ తెలిపారు.
మహిళల ఓట్లతోనే గెలిచారు…
2017లో గుజరాత్‌లో బిజెపికి వచ్చిన ఓట్లను గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టమౌతున్నాయి. బిజెపికి వచ్చిన ఓట్లలో మహిళలు వేసిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. దాంతో గుజరాత్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి సాధ్యమయింది. అదే విధంగా 2016లో తమిళనాడులో జయలలిత తిరిగి అధికారంలోకి రావడానికి కూడా మహిళా ఓటర్లే కారణమని సుష్మితా దేవ్ గణాంకాలతో సహా వివరించారు.
మహిళా అధికార్ యాత్రల ద్వారా మమేకం….
మహిళా ఓటర్లు పెద్ద పెద్ద నాయకుల మీటింగులకు రారని… ఇంటి వద్దే ఉంటారని కాంగ్రెస్ పార్టీ గమనించింది. వారిని ఇంటి వద్దే కలిసి తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు సిద్ధమౌతున్నారు. మహిళా అధికార్ యాత్రల ద్వారా గ్రామీణ, పట్టణ మహిళలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రాబోయే ప్రభుత్వం నుంచి వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చిదంబరం నేతృత్వంలోని మానిఫెస్టో కమిటీకి అందించనున్నారు. మహిళల అభిప్రాయాలను రికార్టు చేయడానికి కాంగ్రెస్ ఓ ప్రత్యేక యాప్ తయారు చేసింది. ఆడియో, వీడియోలను వెంటనే రికార్డు చేసి భద్రపరిచేందుకు అందులో వీలుంటుంది.
నైట్ మార్చ్‌ల ద్వారా అవగాహన
దేశంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నైట్ మార్చ్‌లను ఏర్పాటు చేయనుంది. మహిళా భద్రత, పెరుగుతున్న ధరల వంటి అంశాలపై ఆందోళన చేయనుంది. దేశ వ్యాప్తంగా జరిగే ఈ ర్యాలీలన్ని చివరకు ఢిల్లీ చేరుకోనున్నాయి.