మహాత్ముడికి తీరని అన్యాయం....

బాపూజీ ప్రారంభించిన పాఠశాల త్వరలో మూసివేత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు దేశమంతా సర్వసన్నద్ధమవుతున్న తరుణంలో మహాత్ముడికి తీరని అన్యాయం జరుగుతుండడం విచారకరం. బాపూజీ చేతులమీదుగా ప్రారంభమైన ఓ పాఠశాలను మూసివేయబోతుండడం విస్తుగొలుపుతోంది. 97 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్న ఆ పాఠశాలను తగినంత మంది విద్యార్థులు లేరన్న కారణంగా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గాంధీజీ స్వాతంత్య్ర పోరాటంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో దేశమంతటా స్వదీశీ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలోనే గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో […]

Advertisement
Update:2018-09-30 16:45 IST
  • బాపూజీ ప్రారంభించిన పాఠశాల త్వరలో మూసివేత

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు దేశమంతా సర్వసన్నద్ధమవుతున్న తరుణంలో మహాత్ముడికి తీరని అన్యాయం జరుగుతుండడం విచారకరం. బాపూజీ చేతులమీదుగా ప్రారంభమైన ఓ పాఠశాలను మూసివేయబోతుండడం విస్తుగొలుపుతోంది.

97 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్న ఆ పాఠశాలను తగినంత మంది విద్యార్థులు లేరన్న కారణంగా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గాంధీజీ స్వాతంత్య్ర పోరాటంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో దేశమంతటా స్వదీశీ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలోనే గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 1921లో రాష్ట్రీయ పాఠశాల పేరుతో ఓ విద్యాలయాన్ని ప్రారంభించారు.

గుజరాత్‌ విద్యాపీఠ్ తో పాటే ఏర్పాటు చేసిన ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అదే సమయంలో ఆ పాఠశాలకు నిధులూ తగ్గిపోతూ వచ్చాయి. 1970 నుంచి 2000 సంవత్సరం మధ్య ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థుల సంఖ్య ఉండేది. ఇపుడు 1 నుంచి 7 వ తరగతి వరకు 37 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. వారిని వేరే స్కూళ్లలో చేర్పించి ఆ పాఠశాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ పాఠశాలను గాంధీజీ ప్రారంభించడమే కాదు ఈ పాఠశాలకు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ పాఠశాల రాజ్యాంగాన్ని స్వయంగా బాపూజీయే రాశారట. 1939లో ఆయన ఈ పాఠశాల ఆవరణలోనే నిరాహారదీక్షకు దిగారు. ఎందరో మహామహులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ప్రస్తుత గుజరాత్‌ విద్యాపీఠ్ వైస్‌ ఛాన్స్‌లర్‌ అనామిక్‌ షా ఒకప్పుడు ఈ పాఠశాల విద్యార్థే. మహాత్ముని ఆశయాలతో ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పాఠశాలకు పునర్వైభవం తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోవడం, మూసివేయాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Tags:    
Advertisement

Similar News