కాంగ్రెస్ రమ్మంటోంది.... మాయావతి పొమ్మంటోంది....
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి… కాంగ్రెస్‌తో దోస్తీకి ససేమిరా అంటున్నారు. చత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ జోగితో జతకట్టిన మాయావతి… మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టడంతో సోలోగా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. బిఎస్పీ ఆశించినన్ని స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో ఎన్నికల బరిలో ఒంటరిగా దిగేందుకు మాయావతి నిర్ణయించుకున్నారని… పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో […]
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి… కాంగ్రెస్‌తో దోస్తీకి ససేమిరా అంటున్నారు. చత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ జోగితో జతకట్టిన మాయావతి… మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టడంతో సోలోగా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. బిఎస్పీ ఆశించినన్ని స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో ఎన్నికల బరిలో ఒంటరిగా దిగేందుకు మాయావతి నిర్ణయించుకున్నారని… పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను కూడా దాదాపు సిద్ధం చేసినట్లు సమాచారం. అక్టోబర్ నుంచి ఈ మూడు రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మాయావతి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 22 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన బిఎస్పీ అక్టోబర్ మొదటి వారంలో మిగతా 168 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించనుంది.
బిజెపిని అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్‌తో ఎన్నికలకు ముందే అవగాహన కుదర్చుకున్న మాయావతి… అదే విధానాన్ని రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనుసరిస్తారని అందరూ భావించారు. కానీ మాయావతి అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లోను, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోను ఒంటరిగా పోటీ చేసిన మాయావతి ఘోరంగా వైఫల్యం చెందారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీఎస్పీ గెలవలేకపోయింది. ఇన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా మాయావతి తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఒంటరిగానే బరిలో దిగేందుకు సిద్ధమౌతోంది.
కాంగ్రెస్ నేతలు మాయావతిని బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కూటమిలోకి రమ్మని కాంగ్రెస్ ఇస్తున్న స్నేహ హస్తాన్ని మాయావతి తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను పొమ్మంటున్నారు. ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపిస్తానని చెబుతున్నారట. మాయావతి ఒంటరి ప్రయాణం ఆమెకు మేలు చేస్తుందో లేదో తెలియదు గానీ… బిజెపికి మాత్రం కొంతలో కొంతైనా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.