కడియం శ్రీహరికి భవిష్యత్ భయం.... కారణం అదేనా?
వరంగల్ టీఆర్ఎస్‌లో కొత్త ముసలం మొదలైంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి టికెట్లు ఇవ్వడంలేదని కొందరు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ కారు దిగేశారు. మరికొందరు కూడా కొత్త దార్లు వెతుక్కుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గులాబీ కోటలో ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమేనని సిగ్నల్స్ వస్తుండడంతో ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వినికిడి. గులాబీ బాస్ జంబో లిస్ట్ ప్రకటించిన తర్వాత డిప్యూటీ సీఎం కడియం అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. స్టేషన్ ఘన్‌పూర్ […]
వరంగల్ టీఆర్ఎస్‌లో కొత్త ముసలం మొదలైంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి టికెట్లు ఇవ్వడంలేదని కొందరు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ కారు దిగేశారు. మరికొందరు కూడా కొత్త దార్లు వెతుక్కుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గులాబీ కోటలో ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమేనని సిగ్నల్స్ వస్తుండడంతో ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వినికిడి.
గులాబీ బాస్ జంబో లిస్ట్ ప్రకటించిన తర్వాత డిప్యూటీ సీఎం కడియం అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి టిక్కెట్ ఆశించారు. ఆయనకు కాకపోయినా…. కనీసం ఆయన కూతురికి టిక్కెట్ ఇప్పించాలనుకున్నారు. కానీ అది రాజయ్యకు వెళ్లింది.
తన రాజకీయ భవిష్యత్, కూతురి పొలిటికల్ ఎంట్రీపై ఆశలు పెట్టుకున్న కడియం శ్రీహరి…. ఇప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్ సీటు తన కూతురికి ఇచ్చి…. తనకు వరంగల్ ఎంపీ సీటు ఇవ్వాలనే ప్రతిపాదనలు పెట్టారని అంటున్నారు.
ఇప్పటికే ఆయన స్టేషన్ ఘన్‌పూర్‌లో అభిమానులతో ఓ సమావేశం నిర్వహించారు. అంతర్మథనంలో ఉన్నట్లు కనిపించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తన సన్నిహితులకు చెబుతున్నారు.
కడియం అంతర్మథనం వెనుక వేరే కారణాలు ఉన్నాయని కూడా ఓ టాక్ విన్పిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చినా… తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం లేదని కడియం అంచనా. ఎందుకంటే ఇప్పటికే ఆయన సామాజికవర్గం కోటాలో మంత్రి పదవి ఆశించే నేతలు పుట్టుకొచ్చారు.
కేటీఆర్ కోటరీకే ఆ పదవి దక్కుతుందని…. తనకు ప్రాధాన్యం లేని ఏదో ఓ పదవి ఇస్తారని కడియం వాపోతున్నారట. అందుకే కడియం రాజకీయ లెక్కలు వేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ మాట ఇస్తే… పార్టీ మారితే ఎలా ఉంటుందనే ఓ ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది.