ఆడవారి ఆలయ ప్రవేశానికి అనుమతి.... వ్యతిరేకించిన మహిళా న్యాయమూర్తి
శబరిమల ఆలయంలోకి ఆడవారికి కూడా ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సీజే దీపక్ మిశ్రా ధర్మాసనం ఈమేరకు తీర్పు చెప్పింది. అయితే ఐదుగురు సభ్యులు ధర్మాసనంలో మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా మాత్రం మిగిలిన నలుగురు న్యాయమూర్తులతో విభేదించారు. శబరిమల ఆలయంలోకి ఆడవారికి ప్రవేశం కల్పించడాన్ని ఆమె వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు […]
శబరిమల ఆలయంలోకి ఆడవారికి కూడా ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
సీజే దీపక్ మిశ్రా ధర్మాసనం ఈమేరకు తీర్పు చెప్పింది. అయితే ఐదుగురు సభ్యులు ధర్మాసనంలో మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా మాత్రం మిగిలిన నలుగురు న్యాయమూర్తులతో విభేదించారు. శబరిమల ఆలయంలోకి ఆడవారికి ప్రవేశం కల్పించడాన్ని ఆమె వ్యతిరేకించారు.
మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని, శబరిమల ఆలయ వివాదాన్ని ఒకే తరహాలో చూడలేమని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయ ప్రవేశం నిషేధం గురించి ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరు కూడా కోర్టును ఆశ్రయించలేదన్నారు.
కేరళ మహిళాల్లో అత్యధిక మంది విద్యావంతులని, వారు కూడా శబరిమల ఆలయంలోకి ఆడవారి ప్రవేశ నిషేధాన్ని ప్రశ్నించడం లేదన్నారు. అయితే మిగిలిన న్యాయమూర్తులు మాత్రం మహిళల పట్ల ఇలాంటి వివక్ష తగదంటూ ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ తీర్పు చెప్పారు.